బీఎంసీకి కంగన షాక్... రూ.2కోట్ల నష్టపరిహారం డిమాండ్... లీగల్ నోటీసులు జారీ
కంగనతో అంత ఈజీ కాదన్న విషయం మరోసారి ముంబై నేతలకు అర్ధమైంది. బాధాతప్త హృదయంతో ముంబై వీడిన కంగన, మనాలీకి చేరుకుంటూనే మరోసారి బాంబు విసిసింది. తన కార్యాలయాన్ని ధ్వసం చేసిన బీఎంసీకి లీగల్ నోటీసులు పంపింది.
ముంబైలోని తన కార్యాలయం పై దాడి చేసి ధ్వంసం చేసిన బీఎంసీ, తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ మేరకు లీగల్ నోటీసులు సైతం జారీ చేయించింది. నగరాన్ని విడిచి వెళ్లే ముందే ధ్వంసమైన తన భవనాన్ని పునర్ నిర్మించేందుకు తన వద్ద డబ్బులేవని స్పష్టం చేసిన కంగన, అదే కార్యాలయం నుంచి పనిచేస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై ముంబైలో ఉండగానే గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి పరిస్థితిని వివరించిన కంగన, తనకు న్యాయం దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కరోనా వల్ల ప్రస్తుతం చేతిలో పని కూడా లేనందున ఇప్పుడు కార్యాలయాన్ని రినోవేట్ చేయలేనని చేతులెత్తేసింది.
తాజాగా ఎవరైతే తన భవనాన్ని ధ్వంసం చేశారో, వారే నష్టపరిహారాన్ని సైతం చెల్లించాలని కుండబద్దలు గొట్టేసింది. కంగన నోటీసులకు బీఎంసీ ఇంకా సమాధానమివ్వాల్సి ఉంది. మరి అటువైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











