నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీరే ఇది... మరోసారి నొక్కివక్కాణించిన కంగన
తనతో పెట్టుకుంటే సీఎం అంతటివాడైనా సరే వెనక్కు తగ్గాల్సిందేనని నిరూపించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, నాలుగు రోజుల వ్యవధిలోనే ముంబై నగరంలో చిన్నపాటి సునామీనే సృష్టించింది. ఈ హడావిడి సద్దుమణగడంతో కాస్త శాంతించినట్లే కనిపిస్తోన్న కంగన, ఈరోజు ఉదయమే తన సొంత ఊరు మనాలీకి బయలుదేరింది.
భారీ హృదయంతో ముంబైని విడిచి వెళుతున్నట్లు ట్వీట్ చేసింది. అయితే, ఇప్పటివరకూ జరిగింది అంతా చూస్తే, ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న తన వ్యాఖ్యలు నిజమయ్యాయనే అనిపిస్తోందని, అందుకే ఆ మాటకు కట్టుబడి ఉంటానని నొక్కివక్కాణించింది.

ముంబైలో తాను గడిపిన వారం రోజుల్లో తన ఇంటిపై ఎన్నో దాడులు జరిగాయని, పలువురు దుండగులు ఇంట్లోకి జొరబడి తనకు హానీ చేయాలని చూశారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వల్లే తాను సురక్షితంగా బయటపడ్డానని తెలిపింది. కంగన ముంబై వీడుతున్న సమయంలోనూ ఆమె వ్యతిరేకులు, ప్రభుత్వ మద్దతుదారులు నిరసనలు చేపడుతూనే ఉన్నారు.
కంగన ప్రయాణంతో ఆమెకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తెరలేచిన యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసిన కంగన ఆయనతో పాటూ 45 నిమిషాలపాటూ భేటీ అయింది. సుధీర్ఘమైన చర్చోపచర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన కంగన ఆయన తమకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications