18 ఏళ్ల వయసులోనే తొలి అనుభవం.. నా గుండె పగిలింది అలా.. కంగన
బాలీవుడ్ నటి కంగన రనౌత్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో సెక్స్ గురించి మాట్లాడి సంచలనం రేపి.. తాజాగా తన మొదటి ముద్దు, తొలి అఫైర్ గురించి వెల్లడించి మరోసారి మంటలు రేపింది. పిల్లల సెక్స్ గురించి వివాదాస్పద విషయాలపై కామెంట్ చేయడం తెలిసిందే. తన తొలి ముందు ఎలాంటి గందరగోళానికి దారి తీసిందనే విషయాన్నివెల్లడించింది. ఆమె ఏం చెప్పారంటే..

తొలి ముద్దు చేదు అనుభవం
కంగనకు తొలి ముద్దు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏదో మధురానుభూతిని పొందాలనుకొంటే చప్పగా ముగిసిందని వెల్లడించింది. నా తొలి ముద్దు మ్యాజిక్ సృష్టించలేదు. అంతా గందరగోళంగా మారింది. నా దవడలు కదల్లేదు. నోరు మూత పడింది. దాంతో ఆ వ్యవహారం ముందుకు సాగలేదు అని కంగన రనౌత్ చెప్పింది.

తొలి ప్రేమ గురించి
ఇక కంగన మొదటి అఫైర్ కూడా అసంతృప్తిని ముగించింది. నా వయసు 18 ఏళ్లు ఉన్నప్పుడు అఫైర్‌లో పడ్డాను. నేను చండీగఢ్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మరో అమ్మాయి డేటింగ్‌లో ఉండే వాడు. ఏదో విభేదాల వల్ల వారి అఫైర్ బ్రేక్ అయింది. అతను చూడటానికి అందంగా ఉంటాడు. అప్పుడు అతడి వయసు 28. అతడికి ప్రపోజ్ చేస్తే నువ్వు చిన్నపిల్లదానిలా ఉన్నావు. నీతో అఫైర్ ఏంటని అన్నాడని కంగన వెల్లడించింది.

నా గుండె పగిలింది.
ప్రేమ అనేది మాములు విషయం కాదు. ఈ గేమ్ నీకు అర్థం కాదు. నీవు చిన్నపిల్లవు. ఇప్పుడే ఇలాంటి వద్దని అన్నాడు. అప్పటి వరకు నేను గొప్ప ప్రేమికురాలిననే ఫీలింగ్ కుప్పకూలింది. అంతేకాకుండా నా గుండె పగిలింది. అయినా ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను పెద్దదానిని అయిపోతాను అంటూ మెసేజ్ చేశాను. అయినా అతడు నా ప్రేమను అంగీకరించలేదు అని కంగన చెప్పింది.

రెండో అఫైర్ అలా
ఇక మరోసారి ప్రేమలో పడ్డప్పటికీ అది కూడా సుఖాంతం కాలేదని చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాను. నా టీచర్ నుంచి ప్రేమలో పడ్డాను. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఏ యువతీ యువకుడైనా టీచర్‌తో ప్రేమలో పడటం సహజం. నా విషయంలోనూ అలానే జరిగింది అని కంగన చెప్పింది.


Click it and Unblock the Notifications











