ఆ వయసులోనే లైంగిక వేధింపులు.. అతను నా కంటే నాలుగేళ్ళు పెద్ద.. అసభ్యంగా తాకుతూ: కంగనా రనౌత్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ హీరొయిన్ గా క్రేజ్ అందుకున్న కంగనారనౌత్ నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఇక ఆమె ఒక రియాలిటీ షోతో ఇటీవల హోస్ట్ గా మారడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మరింతగా వైరల్ అవుతోంది. ఇక షోలో ఆమె కంటెస్టెంట్స్ బాధలు గురించి కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఒక టాలెంటెడ్ యువకుడు చెప్పిన లైంగిక వేధింపుల విషయం గురించి తెలుసుకున్న కంగనా ఒక్కసారిగా షాక్ అయ్యింది..అంతే కాకుండా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి కూడా చెప్పుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

లేడి సూపర్ స్టార్
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర హీరోలకు దీటుగా వందకోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది. ప్రతి సినిమాలో కూడా తన పాత్ర విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే కంగనా ప్రాణం పెట్టే ప్రతి పాత్రలో నటిస్తుంది. ఇక ఆమె లేడీ సూపర్ స్టార్ గా కూడా గుర్తింపు పొందుతుంది.

ధైర్యంగా..
ఇక కంగనారనౌత్ తప్పు చేసిన ఎవరైనా సరే ధీటుగా వారికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలను సైతం ఆమె డైరెక్టుగానే తిట్టేసింది. క్యాస్టింగ్ కౌచ్ అలాగే అగ్రహీరోల డామినేషన్ నెపోటీజమ్ గురించి కూడా చాలా ధైర్యంగా మాట్లాడింది. అంతేకాకుండా చిన్న సినీ నటులను కూడా పెద్ద హీరోలు తొక్కేస్తూ ఉంటారు అని కూడా ఆమె కొంత మంది అగ్ర హీరోల పై పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేసింది.

రియాలిటి షో హోస్ట్ గా..
కంగనా రనౌత్ ఇటీవల ఒక రియాలిటీ షోకు హోస్ట్ గా మారి సరికొత్త గా ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన లాకప్ అనే రియాల్టీ షో కు ప్రస్తుతం మంచి క్రేజ్ దక్కుతోంది. రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ కు సంబంధించిన ప్రతి అంశం కూడా హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

షాక్ అయిన కంగనా
ప్రత్యేకంగా ఇటీవల ఒక కంటెస్టెంట్స్ గురించి ఎవరూ ఊహించని విషయాలను తెలుసుకున్న కంగనా షాక్ అయ్యింది. అతను తన ఆరేళ్ల వయస్సు నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. జడ్జిమెంట్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మునావర్ ఫరూఖి ఫరూక్ తన బాధ గురించి నాకు ముందు చాలా ఎమోషనల్గా చెప్పుకున్నాడు. తన దగ్గరి బంధువులే లైంగికంగా వేధించే వారు అని సుమారు 4 ఏళ్ళ పాటు నరకం చూసినట్లుగా అతను చెప్పుకోవడం ఎంతో ఆశ్చర్యానికి లోనైంది.

అసభ్యకరంగా తాకేవాడు అంటూ..
మునావర్ అలా చెప్పగానే అతన్ని చూసి కంగనా రనౌత్ కూడా చాలా బాధకు గురి అయింది. ముందుగా
ఇలాంటి సంఘటనలను అందరి ముందు పబ్లిక్ గా చెప్పినందుకు నీ ధైర్యం చాలా గొప్పది అని అతని పై ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాకుండా తనకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పుకుంది. తన చిన్నతనంలో కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని చెప్పింది. తనకంటే నాలుగేళ్ళ పెద్దవాడైన వ్యక్తి అసభ్యకరంగా తాకేవాడు అంటూ అప్పుడు లైంగికంగా బాధకు గురవుతున్నాము అనే విషయం కూడా తమకి తెలియదని.. కంగనా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











