For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక నుంచి వివాదాలకు దూరంగా కంగనా.. ఆ పనులతోనే బిజీగా..

    |

    బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా కూడా మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లే. ఎందుకంటే కంగనా ఎలా స్పందించినా కూడా అనేక రకాల కోణాల్లో వివాదాలు క్రియేట్ అవుతుంటాయి. మొన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఆమె ఒక ఉద్యమమే నడిపింది. ఇక నెపోటిజమ్ నుంచి ఆ వ్యవహారం రాజకీయాల వరకు వెళ్లింది. ఇక చివరకు కంగనా ఆఫీస్ పై కూడా ఆ ప్రభావం పడిందని చాలా క్లియర్ గా అర్థమైంది.

    ఏదేమైనా కాంగనా ప్రతి ఒక్క విషయంపై చాలా ధైర్యంగా స్పందిస్తుంది అనేలా ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంది. ఇక చాలా రోజుల తరువాత ఈ సీనియర్ నటీమణి షూటింగ్స్ తో బిజీగా మారింది. మొన్నటివరకు జరిగిన వివాదాలను పక్కనపెట్టిన ఆమె పూర్తిగా షూటింగ్ తోనే బిజీగా మారనుంది. కంగనా నెక్స్ట్ జయలలిత బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లాక్ డౌన్ కి ముందే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన ఆమె ఇప్పుడు వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ని కూడా ఫినిష్ చేయాలని అనుకుంటోంది.

    Kangana ranaut about thalaivi shooting restart

    ఇక ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన కంగనా దాదాపు 7నెలల తరువాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాను అంటూ.. ఈ పాండమిక్ సమయంలో తప్పకుండా మీ ఆశీర్వాదం నా పై ఉండాలని కోరుకుకుంటున్నాను అని కంగనా సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక జయలలిత బయోపిక్ కోసం తైలవి అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తమిళ్ దర్శకుడు ఎఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా హిందీలోలోనే కాకుండా తెలుగు తమిళ్ లో కూడా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ వర్క్ చేస్తున్నారు.

    English summary
    Taapsee pannu counter on Kangana Ranaut b grade comments, Sushant's suicide has put some stars in a lot of trouble. It is a known fact that heroes like Sushant are being bullied due to nepotism. Karan Johar was the one who suffered the most from these comments. Now he is creating a separate private Instagram account that is going viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X