Kangana Ranaut బాంబే హైకోర్టుకు బాలీవుడ్ క్వీన్.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ పరువు నష్టం దావా కేసులో ముంబైలోని కోర్టుకు హాజరయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ కంగన రనౌత్‌పై ప్రముఖ సినీ రచయిత జావెద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్ది నెలలుగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్‌ను స్వయంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగన రనౌత్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు గురించి మరిన్నీ వివరాల్లోకి వెళితే..

జావెద్ అఖ్తర్‌పై కంగన తీవ్ర ఆరోపణలు

జావెద్ అఖ్తర్‌పై కంగన తీవ్ర ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మీడియాతో కంగన రనౌత్ మాట్లాడుతూ.. జావెద్ అఖ్తర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మహేష్ భట్, అలాగే హృతిక్ రోషన్ కుటుంబంతో జరిగిన గొడవల సమయంలో తనను జావెద్ అఖ్తర్ బెదిరించారు. తనను ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారు అని ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. తనపై కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కంగనపై జావెద్ అఖ్తర్ పరువు నష్టం దావా

కంగనపై జావెద్ అఖ్తర్ పరువు నష్టం దావా

అయితే కంగన రౌనత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతేడాది నవంబర్‌లో జావెద్ అఖ్తర్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా వేస్తూ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ కేసును దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు అంధేరి పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా నివేదికను సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నది.

కంగన రనౌత్ అభ్యర్థనను కొట్టవేసిన కోర్టు

కంగన రనౌత్ అభ్యర్థనను కొట్టవేసిన కోర్టు

అయితే తనపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను కొట్టివేయాలని కంగన రనౌత్ కోర్టును వేడుకొన్నది. అయితే ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చి కేసు విచారణఖు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన క్లయింట్‌ను పదే పదే ఎందుకు కోర్టులో హాజరుకావాలని ఒత్తిడి తెస్తున్నారో అర్ధం కావడం లేదంటూ కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కంగన న్యాయవాది రిక్వెస్ట్‌ను కొట్టివేస్తూ.. కంగన తప్పకుండా కోర్టులో హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 20వ తేదీన కంగన హాజరు

సెప్టెంబర్ 20వ తేదీన కంగన హాజరు

దాంతో కంగన రనౌత్ సోమవారం (సెప్టెంబర్ 20వ తేదీన) బాంబే కోర్టుకు హాజరయ్యారు. కంగన రనౌత్ కంటే ముందే జావెద్ అఖ్తర్ కోర్టులో కనిపించారు. కోర్టులో వాదనల సందర్భంగా కంగనపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పదే పదే ఆమెను హాజరుకావాలంటూ ఒత్తిడి చేయకండి. ఆమె ఆరోగ్య కారణాల వల్లే కోర్టుకు హాజరుకాలేదని న్యాయవాది సిద్ధిఖి చెప్పారు. ఈ కేసును విచారించిన బాంబే కోర్టు తదుపరి విచారణను నవంబర్ 15వ తేదికి వాయిదా వేసింది.

Recommended Video

Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
కంగన రనౌత్ సినిమా కెరీర్ ఇలా..

కంగన రనౌత్ సినిమా కెరీర్ ఇలా..

బాలీవుడ్ అగ్రని కంగన రనౌత్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది. అలాగే బాలీవుడ్‌లో ధాకడ్, తేజాస్, మణికర్ణిక రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X