వేశ్య..మండిలో నీ ధర ఎంత? కంగనపై దారుణంగా పోస్ట్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన క్వీన్!
బాలీవుడ్ నటి కంగన రనౌత్ పాలిటిక్స్‌లోకి ప్రవేశించగానే రాజకీయ పార్టీలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని తవ్వి దుష్ర్పచారానికి వాడుకొనే పనిలో పడ్డారు. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో బీజేపీ వెల్లడించిన 5వ జాబితాలో కంగన రనౌత్ పేరు ఉండటం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. అయితే గతంలో ఆమె నటించిన సినిమాలో అశ్లీలంగా నటించిన పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా చైర్ పర్సన్ చేసిన పోస్టు వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై కంగన రనౌత్ స్పందిస్తూ..
హిమచల్ ప్రదేశ్ నుంచి కంగన రనౌత్ పార్లమెంట్‌కు పోటీ చేస్తుందనే ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్, డిజిటల్ మీడియాకు చెందిన సుప్రియా శ్రీనేట్ అసభ్యంగా కంగన రనౌత్ ఫోటోను పోస్టు చేసి.. మండిలో ఎంత ధర పలుకున్నదో ఎవరైనా చెప్పగలరా? అంటూ ఎద్దేవా చేసింది. ఆ పోస్టుకు కంగన రనౌత్ ఘాటుగా జవాబిచ్చింది.

డియర్ సుప్రియా జీ.. బాలీవుడ్‌లో గత 20 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించాను. క్వీన్ చిత్రంలో అమాయకమైన అమ్మాయిగా, ధాకడ్‌లో సెడక్టివ్ స్పైగా, మణికర్ణికలో వీరనారిగా, చంద్రముఖిలో దెయ్యంగా రజ్పో సినిమాలో వేశ్యగా, తలైవి చిత్రంలో విప్లవనాయకురాలిగా నటించాను అని తన కెరీర్‌లో కీలకమైన చిత్రాలను కోట్ చేసింది.
అపోహాలు, అనుమానాలు, కొన్ని అడ్డంకులను నుంచి మన అమ్మాయిలకు స్వేచ్ఛ కల్పించాలి. వారి శరీరంలోని అవయవాలపై ఉండే శ్రద్దకు మించి వేరే విషయాలను తెలియజేయాలి. అంతకు మించి వేశ్య వృత్తి జీవితాలను, వారు అనుభవించే పరిస్థితులను అసభ్యంగా, అశ్లీలంగా చూపించే ప్రయత్నాలు దూరంగా ఉండాలి. ప్రతీ మహిళ తమ హుందాతనాన్ని కోరుకొంటుంది అని కంగన రనౌత్ ఘాటుగా స్పందించింది.

అయితే సుప్రియా చేసిన పోస్టుపై నెటిజన్లు ఘాటుగానే స్పందించారు. మహిళను దారుణంగా కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించడం సిగ్గు చేటు. ఇలాంటి పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలి. గతంలో సోనియా గాంధీ ఫోటోలు, రాహుల్ గాంధీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే వారు బాధపడ్డారు. ఈ విషయంలో మహిళలు మనోభావాలు దెబ్బ తీయవా? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే సుప్రియా పొరపాటున పోస్టు చేసింది. తన తప్పు తెలుసుకొని ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. ఇలాంటి పోస్టులను సాకుగా చూపి సానుభూతితో పొందాలనుకోవడం చవకబారు తనం.. ఇలాంటి పోస్టుల వల్ల మండి లోక్‌సభ స్థానం నుంచి గెలువాలని చేసే ప్రయత్నం వృధా అని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











