Kangana Ranaut: నేను పెద్ద తప్పు చేశా.. ఆ విషయంలో భయపడుతున్నా..

బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగానే కాకుండా, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయానైనా.. ముక్కుసూటిగా చెప్పడం ఆమె నైజం. దీంతో బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఓ పెద్ద తప్పు చేశాననీ, ఆ విషయంలో భయపడుతున్నననీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ కంగనా ఏం విషయంలో తప్పు చేసింది? ఎందుకు భయపడుతుంది? అనే వివరాల్లోకెళ్లే..

హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ'ఎమర్జెన్సీ'. ఈ సినిమా జనవరి 17న గాండ్ర్ గా విడుదల కాబోతుంది. అనేక వివాదాలు, వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ సినిమాకు కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఇది కంగనా దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. గతంలో కంగనా రనౌత్ 'మణికర్ణిక' చిత్రానికి సగానికి దర్శకత్వం వహించింది. కానీ, ఆ సినిమాను మధ్యలోనే వదిలేశారు. అయితే.. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది.

Kangana Ranaut believes choosing theatrical release for Emergency over OTT was a mistake

ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ తన 'ఎమర్జెన్సీ' సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. 'ఎమర్జెన్సీ' సినిమా పలుమార్లు వాయిదా పడటం గురించి ప్రశ్నించగా.. ఎమర్జెన్సీ సినిమా తీయడమేమో చాలా ఇబ్బందులెదుర్కొన్నననీ, ఈ సినిమా ఏమో గానీ తాను మాత్రం భయపడ్డానని కంగనా ఒప్పుకుంది. ఎమర్జెన్సీ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం తప్పుడు నిర్ణయమని, OTTలో విడుదల మంచి డీల్ దొరికేదని తనకు అనిపించిందనీ, తాను సెన్సార్‌షిప్ ద్వారా వెళ్ళవలసిన అవసరం ఉండదని, సెన్సార్‌ బాధలు పడే అవసరం ఉంది కాదన్నారు.

ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం ఒక్కటే తాను చేసిన తప్పు కాదనీ, దానికంటే ముందు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నానని బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. ఈ సినిమాలో సన్నివేశాలను ఎందుకు తీసేయాలనుకుందో అర్థమే కాలేదని అన్నారు. గతంలో కిస్సా కుర్సీ కా (ఇందిరా గాంధీ పై వచ్చిన సెటైరికల్‌ మూవీ) సినిమా వచ్చిందనీ, కానీ ఈ సినిమాను ఎవరూ చూడలేదన్నారు. అప్పట్లోనే ఈ సినిమా ప్రింట్స్ ను కూడా కాల్సి వేశారు. దీంతో ఆ చిత్ర దర్శకుడు అమృత్‌ నహ్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు కంగనా.

Kangana Ranaut believes choosing theatrical release for Emergency over OTT was a mistake

కాగా కంగనా స్వీయ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, అశోక్ చాబ్రా, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. గతేడాది సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం ఈ నెల 17న రిలీజవుతోంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన తేజస్ (2023) తర్వాత కంగనా నటించిన 'ఎమర్జెన్సీ'. గత 5 సంవత్సరాలలో కంగనా రనౌత్ ఒక్క హిట్ సినిమా కాలేదు. అందుకే ఈ సినిమాపై కంగనా చాలా అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Read more about: kangana ranaut emergency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X