twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందువుల రక్తమంటే అంత చులకనా? అక్కడ రక్తపుటేరులు.. కంగన కంటతడి.. ట్విట్టర్ అకౌంట్ రద్దు తర్వాత..

    |

    పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారంటూ కంగన అకౌంట్‌ను రద్దు చేస్తూ ట్విట్టర్ వేటు వేసింది. తన ట్విట్టర్ (కంగనరౌత్ టీమ్) అకౌంట్‌ను తొలగించిన తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేస్తూ కంటతడి పెట్టింది. తాజా వీడియోలో కంగన రనౌత్ ఏం మాట్లాడారంటే..

    ఇన్స్‌టాగ్రామ్‌లో కంగన రనౌత్ వీడియో

    ఇన్స్‌టాగ్రామ్‌లో కంగన రనౌత్ వీడియో

    స్నేహితులారా! బెంగాల్‌ నుంచి చాలా విషాదకరమైన వార్తలు అందుతున్నాయి. అనేక వీడియోలు, ఫోటోలు అందుతున్నాయి. అవన్నీ చాలా డిస్ట్రర్బ్‌గా ఉన్నాయి. బహిరంగంగా హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. ఇళ్లను తగులబెడుతున్నారు. కానీ ఇలాంటి సంఘటనలపై ఏ ఒక్కరు కూడా పెదవి విప్పడం లేదు అని కంగన రనౌత్ తన వీడియోలో కంటతడి పెట్టుకొంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    బెంగాల్‌లో మారణహోమంపై కంగన ఫైర్

    బెంగాల్‌లో మారణహోమంపై కంగన ఫైర్

    బెంగాల్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఏ ఒక్క మీడియా కూడా కవర్ చేయడం లేదు. అంతర్జాతీయ మీడియా ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. కవర్ చేయకపోవడంతో ఇండియా వెనుక ఎలాంటి కుట్ర ఉందో నాకు అర్థం కావడం లేదు అని కంగన రనౌత్ తన వీడియోలో పలు అనుమానాలను వ్యక్తం చేశారు.

    ఇండియాపై కుట్రలు అంటూ..

    ఇండియాపై కుట్రలు అంటూ..

    ఇండియాపై ఇలాంటి కుట్రలు చేయడం ద్వారా ఏం చేయాలని అనుకొంటున్నారు. హిందువుల రక్తమంటే అంత చవకగా ఉందా? ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఇలాంటి విషయాలను నన్ను మనోవేధనకు గురిచేస్తున్నాయి అని కంగన రనౌత్ పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో రక్తపుటేరులు

    పశ్చిమ బెంగాల్‌లో రక్తపుటేరులు

    పశ్చిమ బెంగాల్‌లో రక్తపుటేరులు పారుతున్నాయి. ధర్నాలు చేసి ఆరోపణలు చేస్తున్నారు? ఇలాంటి దేశద్రోహం ఎందుకు? దేశద్రోహుల గురించి ఎందుకింత భయపడుతున్నారు? వాళ్లే దేశాన్ని పాలించాలని అనుకొంటున్నారా? ఇంటర్నేషనల్ మీడియా ఆడే నాటకంలో మనం పీకల్లోతు కూరుకుపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards

    బెంగాల్‌లో అధ్యక్షపాలన తప్పనసరి

    ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్‌లో అధ్యక్ష పాలన అవసరం ఎంతైనా ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ 12సార్లు, ఇందిరాగాంధీ 50 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లకంటే ఎక్కువగా ప్రసిడెంట్ రూల్ పెట్టారు. అధ్యక్ష పాలన పెట్టకుండా మనం ఎందుకు భయపడుతున్నాం. త్వరగా అధ్యక్షపాలన పెట్టి హత్యలను ఆపివేయాలి అంటూ కంగన రనౌత్ కంటతడి పెట్టుకొన్నారు.

    English summary
    Kangana Ranaut broke down after her Twitter account suspended, Release video in Instagram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X