twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్‌పై మండిపడ్డ కంగన రనౌత్.. అలాంటి దుకాణాలు తెరిచి అంటూ..

    |

    గత కొద్దికాలంగా నిప్పు ఉప్పు మాదిరిగా దీపిక పదుకోన్, కంగన రనౌత్ మధ్య వాగ్వాదం కొనసాగుతుండటం, ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆ గొడవలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. తాజాగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపిక పదుకోన్‌పై కంగన రనౌత్ మండిపడ్డారు. గతంలో తాను మానసిక రుగ్మతతో బాధపడ్డాననే విషయాన్ని వెల్లడించడం, కొన్ని సమయాల్లో దానిని ప్రస్తావిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడంపై కంగన అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో తాజాగా దీపికపై కంగన ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించింది. కంగన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    సుశాంత్ మరణం తర్వాత మానసిక సమస్యలపై దీపిక

    సుశాంత్ మరణం తర్వాత మానసిక సమస్యలపై దీపిక

    మానసిక క్షోభ, రుగ్మత లాంటి సమస్యలతో బాధపడటం గురించి దీపిక పదుకోన్ పలుమార్లు ప్రస్తావించారు. సుశాంత్ మరణం తర్వాత మానసిక సమస్యలతో బాధపడుతుంటే ఎలా చేయాలో కొన్ని చిట్కాలు వెల్లడిస్తూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే తన మానసిక సమస్యను పదే పదే చెబుతూ దీపిక సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారనే విమర్శలను కంగన ఘాటుగా ఎక్కుపెట్టింది.

    మెంటల్ హై క్యా సినిమా వివాదం తెరపైకి

    మెంటల్ హై క్యా సినిమా వివాదం తెరపైకి

    తాజాగా వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా దీపిక పదుకోన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మరోసారి కంగన దాడి చేసింది. మానసిక సమస్యలపై తాను రూపొందించిన జడ్జిమెంటల్ హై క్యా సినిమాను తొక్కి వేయడంలో దీపిక పదుకోన్ బ్యాచ్‌ పరోక్షంగా ప్రధాన పాత్ర పోషించారు. రిలీజ్‌కు ముందు మెంటల్ హై క్యా అనే సినిమా టైటిల్ మార్చి జడ్జిమెంటల్ హై క్యా పెట్టడంతో మార్కెటింగ్ పరంగా భారీ దెబ్బ పడింది అని కంగన రనౌత్ ట్వీట్ చేశారు.

    సినిమా టైటిల్ మార్పించి దెబ్బ కొట్టారు.

    సినిమా టైటిల్ మార్పించి దెబ్బ కొట్టారు.


    మెంటల్ హై క్యా అనే సినిమా టైటిల్‌ వైద్యుల మనోభావాలను దెబ్బ తీస్తుందనే కారణంతో ఇండియన్ సైక్రియాటిక్ సొసైటీ కోర్టుకు ఎక్కింది. వారి ఫిర్యాదుతో గుజరాత్ హై కోర్టు టైటిల్‌ను మార్చమని సెన్సార్ బోర్డుకు, అప్పటి చైర్మన్ ప్రసూన్ జోషికి ఆదేశాలు ఇచ్చింది. ఆ కారణంగా రిలీజ్‌కు టైటిల్ మార్చాల్సి వచ్చింది. మంచి సినిమాను అలా దెబ్బ తీశారు. ఆ సినిమా కనీసం ఈ రోజైనా చూడండి అంటూ అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    దీపిక పదుకోన్ పరోక్ష పాత్ర అంటూ కంగన

    దీపిక పదుకోన్ పరోక్ష పాత్ర అంటూ కంగన

    మెంటల్ హై క్యా సినిమా టైటిల్ మార్చడం వెనుక మానసిక రుగ్మత అంశాన్ని ఓ దుకాణంగా మార్చి దాని నుంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించారు. దాని వెనుక దీపిక పదుకోన్ పరోక్షంగా పాత్ర ఉంది. మానసిక సమస్యలపై తీసిన సినిమాను ఇతరులు చూడకుండా రకరకాలుగా ప్రయత్నించారు. ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం వెనుక దీపిక హస్తం ఉంది. ఆ సంస్థతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Kangana Ranaut digs again on Deepika Padukone on World Mental Health Day. Kangana tweeted that The film that we made for Mental Health awareness was dragged to the court by those who run depression ki dukan, after media ban, name of the film was changed just before the release causing marketing complications but it’s a good film, do watch it today #WorldMentalHealthDay
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X