సినీ కార్మికులకు,తలైవి టీమ్‌కు అండగా.. కంగనా విరాళం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలా కుతలం అవుతోంది. ఈ మేరకు భారతదేశంలోనూ కరోనా తన ప్రభావాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే మన దేశంలో 18వేల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 600 మంది దాక మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించార. దీంతో ఎంతో మందికి ఉపాధి కరువైంది. ఈ క్రమంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు.
దక్షిణ భారత నటీనటుల సంఘం (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి.. దాతలు స్పందించాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు రజినీకాంత్ యాభై లక్షల విరాళాన్ని ప్రకటించాడు. రజినీ ముందగుడు వేయడంతో యువ హీరోలు, హీరోయిన్స్ అంతా కదలి వచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో నిధులు సమకూరకపోవడంతో ఆర్కే సెల్వమణి కోలీవుడ్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

ఫెఫ్సీకి నయనతార, అజిత్, లారెన్స వంటి వారు భారీగా విరాళాలు ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దక్షిణ భారత నటీనటుల కోసం విరాళాన్ని ఇచ్చింది. అంతేకాకుండా తాను ప్రస్తుతం నటిస్తున్న తలైవి చిత్ర యూనిట్‌కూ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ.. రూ.10 లక్షలు విరాళం గా ఇస్తున్నట్టు తెలిపింది. అందులో రూ. 5 లక్షలు సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఫెఫ్సీ)కి, రూ. 5 లక్షలు తలైవి సినిమాకు పనిచేస్తున్న వర్కర్లకని పేర్కొంది.


Click it and Unblock the Notifications











