పాత్ర కోసం ప్రాణాలను పక్కన బెట్టిన కంగన రనౌత్.. ‘జయలలిత’ కోసం భారీ సాహసం..
వెండితెరపైన ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించే నేటితరం హీరోయిన్లలో కంగన రనౌత్ ఒకరు. పాత్ర కోసం తన ఆహార్యాన్ని, హావభావాలను పూర్తిగా మార్చుకొనే సత్తా ఉన్న హీరోయిన్ అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి టాలెంట్ ఉన్న కంగన రనౌత్ తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా కోసం భారీ సాహసానికి పూనుకొన్నారు. ఆ సాహసం వివరాల్లోకి వెళితే..

తలైవిలో రకరకాల వేరియేషన్స్
జయలలిత బయోపిక్‌లో కంగన రనౌత్ తన శారీరకంగా రకరకాల వేరియేషన్స్‌తో కనిపించాలి. సన్నగా, లావుగా రెండు విభిన్నమైన కోణాల్లో నటించాల్సి వచ్చింది. అయితే సీఎంగా జయలతిత పాత్రలో కనిపించడానికి ఆమె 20 కేజీల బరువు పెరిగి ఆ పాత్రలో కంగన సంపూర్ణంగా ఒదిగిపోయింది.
నిష్‌విక నాయుడు బ్యూటీఫుల్ ఫోటోలు.. అందంతో సందడి చేసిన యువ హీరోయిన్

కంగన రనౌత్ భరతనాట్యం
అలాగే తలైవి సినిమా కోసం కంగన రనౌత్ చాలా శ్రమించారు. ఈ సినిమా కోసం తమిళ భాషను, అలాగే భరతనాట్యాన్ని నేర్చుకొన్నారు. అలాగే జయలలితకు సంబంధించిన హావభావాలను పట్టుకోవడానికి పలు వీడియోలు, ఆమె స్పీచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

మార్చి 23న తలైవి ట్రైలర్
ఇక కంగన రనౌత్ నటించిన తలైవి చిత్రం ట్రైలర్ లాంచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమా టీజర్ మార్చి 23వ తేదీన చెన్నై, ముంబైలో ఏకకాలంలో ఆవిష్కరించనున్నారు. ఈ ట్రైలర్‌కు ఆవిష్కరణకు ముందు కంగన రనౌత్ భావోద్వేగానికి లోనయ్యారు.

20 కేజీల బరువు పెరిగి...
తలైవి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురించి కంగన రనౌత్ ట్విట్టర్‌లో స్పందించారు. తలైవి ట్రైలర్ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ సినిమా కోసం 20 కేజీల బరువు పెరిగాను. మళ్లీ కొద్ది వారాల్లోనే ఆ బరువును తగ్గించుకొన్నాను. నా కెరీర్‌లో ఇదో గొప్ప ఛాలెంజ్‌గా నిలిచింది. చరిత్రలో నిలిచిపోయే బయోపిక్ అవుతుంది. మీ హృదయాల్లో మరోసారి చోటు సంపాదించుకోవడానికి మీ జయలలిత మీ ముందుకు వస్తున్నది అని కంగన పేర్కొన్నారు.

కంగన రనౌత్ కెరీర్
కంగన రనౌత్ కెరీర్ విషయానికి వస్తే... 2020లో లాక్‌డౌన్‌కు ముందు పంగా చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం జయలలిత బయోపిక్ తలైవిలో, అలాగే హిందీలో ధాకడ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అపరాజిత అయోధ్య చిత్రంలో నటించడమే కాకుండా దర్శకురాలిగా అవతారం ఎత్తనున్నారు.


Click it and Unblock the Notifications











