ప్రభాస్ హీరోయిన్‌కు చంపేస్తామని బెదిరింపులు.. ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు.. డెత్ వార్నింగ్
భారతీయ జనతా పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగన రనౌత్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో నలుగురు వ్యక్తులు కంగన రనౌత్‌పై తీవ్రమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమా నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేయడం ఆందోళనకరంగా మారాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో హిమచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగన రనౌత్ ప్రస్తుతం ఇందిరా గాందీ జీవితం ఆధారంగా రూపొందిన ఎమర్జెన్సీ చిత్రంలో నటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవల ప్రకటించారు. అలాగే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో బెదిరింపు రావడం షాకింగ్‌గా మారాయి.

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన వీడియో ప్రకారం.. ఓ రూమ్‌లో సిక్కు మతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. అందులో ఒకరు మాట్లాడుతూ..ఒకవేళ ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయితే.. ఆ మూవీని సిక్కు కమ్యూనిటీ ఖండిస్తుంది. నీతోపాటు నీ మూవీ కూడా చెప్పు దెబ్బలు తింటుంది అని అన్నాడు.
ఎమర్జెన్సీ మూవీలో ఖాళీస్థాన్‌కు చెందిన నాయకుడు జర్నైల్ సింగ్ బింద్రన్ వాలేను టెర్రరిస్టుగా చిత్రీకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ విషయంలో ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్తగా ఉండు.. నీవు ఆ పాత్రను పోషించినందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు.
వీడియోలో మాట్లాడిన వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వికీ థామస్ సింగ్‌గా గుర్తించారు. వీరందరూ బింద్రన్ వాలేను కీర్తిస్తూ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను కంగన రనౌత్ మహారాష్ట్ర డీజీపీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీస్ శాఖలకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసి షేర్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.


Click it and Unblock the Notifications











