మెంటల్ హై క్యా! లాభాల్లో షేర్ అడుగుతున్న హీరోయిన్!
బాలీవుడ్లో అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు చేసే విధానం, వారి పేమెంట్ విధానం డిఫెంటుగా ఉంటుంది. వారు చేసే సినిమాలకు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో షేర్ తీసుకుంటారు. కేవలం వాళ్ల స్టార్ ఇమేజ్ మీదనే సినిమాలు రన్ అవుతాయి కాబట్టి సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు.
లేడీ స్టార్లలో అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ బేసిస్‌లో పని చేసిన కంగనా రనౌత్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాకు లాభాల్లో షేర్ కావాలని అడుగుతోందట.

కంగనా రనౌత్ ఇపుడు 'మెంటల్ హై క్యా' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు ఆమె అలాంటి డీలే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏక్తా కపూర్, శైలేష్ సింగ్ కూడా కంగనా డిమాండ్లకు అంగీకరించారని తెలుస్తోంది.
బాలీవుడ్లో కంగనా రనౌత్ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. కేవలం ఆమె స్టార్ ఇమేజ్ మీదనే సినిమాలు బాగా రన్ అయిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకుంటే బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.
'మెంటల్ హై క్యా' అనేది కామెడీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న మూవీ. డాస్క్ సైడ్‌ను ఫోకస్ చేస్తూ డిఫరెంటుగా ఈ సినిమాను తీస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు కాస్త భయానకంగా ఉండటం కూడా ఆసక్తిని రేరెత్తిస్తోంది. ఈ చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2019న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











