అక్కడ గట్టిగా గిల్లి.. అదోలా నవ్వాడు.. ఆపై ఏం పీకుతావన్నట్టు చూశాడు? కంగన

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మణికర్ణిక చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయిగా నటి కంగన రనౌత్ ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు జనవరి 25న రిలీజ్ అవుతున్న చిత్రం కోసం విస్త్రృతంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా కంగన మరోసారి లైంగిక వేధింపుల విషయాన్ని తెరమీదికి తెచ్చారు. మీటూ ఉద్యమంపై తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారంటే...

లైంగిక ఆరోపణల గురించి

లైంగిక ఆరోపణల గురించి

సినీ పరిశ్రమలో కొనసాగుతున్న లైంగిక ఆరోపణలను బయటపెట్టడం వల్ల అలాంటి పనులు చేయడానికి ప్రముఖులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఐదో, ఆరో మంది కాకుండా ఇలాంటోళ్లు ఎక్కువగానే ఉంటారని తెలుసుకొంటారు. ఇంకా ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోవాలి అని కంగన పేర్కొన్నారు.

హీరోయిన్ రాణి ముఖర్జి మాటలపై

హీరోయిన్ రాణి ముఖర్జి మాటలపై

మహిళలు తమకు తాము రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. తమ భద్రతను తామే మహిళలు చూసుకోవాలి. మహిళ భద్రతపై రాణి ముఖర్జీ మాట్లాడితే ఆమెను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు మానుకోవాలి అని కంగన సీరియస్ అయ్యారు.

పరిశ్రమలో అభద్రతాభావం ఎక్కువైందని

పరిశ్రమలో అభద్రతాభావం ఎక్కువైందని

సినీ పరిశ్రమలో మహిళలకు అభద్రతాభావం ఎక్కువ అవుతున్నది. ప్రేక్షకులు, జనం మధ్యకు వెళ్లాలంటే చాలా భయంగా ఉంటుంది. ఓ సారి నాకు ఓ భయంకరమైన సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి నా పిరుదుపై గట్టిగా నొక్కాడు. ఆపై ఓ రకమైన చూపు చూసి వెకిలి నవ్వు నవ్వాడు. ఇంకా ఏం చేస్తావన్నట్టు చూస్తూ హేళనగా చూశాడు అని కంగన వెల్లడించింది.

అలాంటివి నేర్చుకొంటే సరిపోదు

అలాంటివి నేర్చుకొంటే సరిపోదు

మహిళలు, అమ్మాయిలు కరాటే, టైక్వాండో లాంటివి నేర్చుకొంటే సరిపోదు. నీకు ఏదైనా చేదు ఘటన ఎదురైతే వెంటనే నీ టీచర్‌కో, తండ్రికో, అన్నకో లేదా మీడియాకో, లేదా పోలీసులకో, లేదా జర్నలిస్టులకు చెప్పుకోవాలి. అలాంటి విషయాలను బయటపెట్టాలి అని కంగన చెప్పింది.

మణికర్ణిక నిర్మాత ఆరోగ్యంపై

మణికర్ణిక నిర్మాత ఆరోగ్యంపై

ఇదిలా ఉండగా, మణికర్ణిక నిర్మాత ఆరోగ్యంపై కంగన స్పందించారు. ఆయన ఆరోగ్యం బాగుంది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నిర్మాతతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాను. సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X