నాపై డ్రగ్స్ కేసా? నిరూపిస్తే శాశ్వతంగా.. కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు
మహరాష్ట్ర సర్కార్‌కు బాలీవుడ్ నటి కంగన రనౌత్ ధీటుగా సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసులో తనపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై ఘాటుగా స్పందించారు. యువ నటుడు ఆద్యన్ సుమన్ ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకొని డ్రగ్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేయడంపై కంగన స్పందిస్తూ..

ముంబై పోలీసుల విచారణకు సంతోషంగా
నిషేధిత డ్రగ్స్ వినియోగించినట్టు తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాను మహారాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ముంబై పోలీసులు విచారణను తాను సంతోషంగా స్వీకరిస్తాను అని కంగన రనౌత్ ట్వీట్లు చేశారు.

నాకు డ్రగ్స్ టెస్టులు చేయండి..
ముంబై పోలీసులు, అనిల్ దేశ్‌ముఖ్ విచారణకు హాజరుకావడం కంటే మరో సంతోషం ఏముంటుంది. దయచేసి నాకు డ్రగ్స్ టెస్టులు చేయండి. నా మొబైల్ ఫోన్ కాల్ రికార్డులపై దర్యాప్తు చేయండి. అన్ని రకాలుగా విచారణ చేపట్డండి అందుకు సిద్ధమే అంటూ కంగన ట్వీట్ చేశారు.

డ్రగ్స్ మాఫియాతో లింకులుంటే..
ముంబై పోలీసులు నా కాల్ డేటాపై దర్యాప్తు చేసి.. ఒకవేళ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు నా కాల్ డేటాలో బయటపడితే.. తాను శాశ్వతంగా ముంబైని వదిలిపెట్టి వెళ్తాను. వీలైనంత త్వరగా మీ ముందుకు రావాలనుకొంటున్నాను అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

శివసేన ఎమ్మెల్యే డిమాండ్ మేరకు..
ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం కంగన రనౌత్‌ను విచారించాలని నిర్ణయం తీసుకొన్నది. శివసేన పార్టీకి చెందిన ప్రభుత, ప్రతాప్ సర్నాయిక్ అసెంబ్లీలో చేసిన డిమాండ్ మేరకు ఆమె దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఆద్యాయన్ సుమన్ తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను ఆధారంగా డ్రగ్ కేసును విచారిస్తాం అని హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.
Recommended Video

యువ హీరో అధ్యాయన్ సుమన్ రియాక్షన్
అయితే ప్రముఖ నటుడు అద్యాయన్ సుమన్ తన పేరు ఈ వివాదంలోకి లాగడంపై స్పందిస్తూ.. పలు ఛానెళ్లు ఈ విషయంపై మాట్లాడమని కోరుతున్నారు. నేను చెప్పిన విషయాలు 2016కు సంబంధించినవి. ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేవు. ఇప్పుడిప్పుడే నా కెరీర్ పాజిటివ్‌గా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నన్ను ఇబ్బందికి గురిచేయవద్దు. దయచేసి నన్ను వివాదంలోకి లాగొద్దు అని ఆయన ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











