twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయవాదం పేరుతో దుకాణం.. పాకిస్థాన్‌పై తరగని ప్రేమ.. కరణ్‌పై కంగన ఫైర్

    |

    బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి దర్శకుడు కరణ్‌ జోహర్ మండిపడ్డారు. సుశాంత్ మరణం తర్వాత నుంచి కొద్దికాలంగా ఆయనపై బంధుప్రీతి, ఫేవరిటిజం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరణ్ జోహర్ రూపొందించిన గుంజన్ సక్సెనా చిత్రంలో దేశభక్తి పేరుతో ఆడుతున్నారంటూ కంగన రనౌత్ నాటకాన్ని ఎండగట్టింది. తాజాగా ఇది కరణ్ జోహర్ బాగోతం అంటూ కవితను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ...

     పాకిస్థాన్‌తో యుద్దమంటే..

    పాకిస్థాన్‌తో యుద్దమంటే..

    దివంగత శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌తో కరణ్ జోహర్ రూపొందించిన గుంజన్ సక్సేనా చిత్రం పలు విమర్శలు అందుకొంటున్నది. పాకిస్థాన్‌తో భారత్ చేసి కార్గిల్ యుద్దాన్ని తప్పుడు రీతిలో చూపించారని, సైనికుల వీరోచిత గాధను సరైన విధానంలో తెరపైన చూపించడంతో విఫలమయ్యారు అనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

    కరణ్ సినిమాను తప్పపట్టిన వైమానిక అధికారులు

    కరణ్ సినిమాను తప్పపట్టిన వైమానిక అధికారులు

    అలాగే వైమానిక దళంలో మహిళలపై వేధింపులు ఉన్నాయనే విధంగా తప్పుడు రీతిలో చిత్రీకరిస్తున్నానరే విషయం వివాదంగా మారింది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు సెన్సార్ బోర్డుకు లేఖ రాసి ఈ చిత్రాన్ని సెన్సార్ చేయాలని, ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు.

     జాతీయభావం దుకాణం తెరిచి దేశభక్తిని చూపించకుండా

    జాతీయభావం దుకాణం తెరిచి దేశభక్తిని చూపించకుండా

    ఇలాంటి సమయంలో కరణ్‌ జోహర్‌ను దెప్పి పొడుస్తూ.. ఆయన కోసం నా కవిత రాశాను. జాతీయ భావంతో దుకాణం నడిపించాలి కానీ దేశభక్తి చూపించవద్దు. పాకిస్థాన్‌తో యుద్ధ నేపథ్యంగా సినిమా తీస్తే బాగానే చూపించవచ్చు. అయితే గుంజన్ సక్సేనా సినిమాలో మాత్రం పాకిస్థానీ వాళ్లను విలన్‌గా చూపించకుండా.. దేశీయ అధికారులే విలన్ అనే విధంగా చూపించాలి. ఇక ఆర్మీలో ఆడ, మగ కాకుండా మూడో లింగం కూడా వచ్చింది. సేనాని కేవలం సేనాని అనే విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకొంటావో కరణ్ అంటూ కంగన సెటైర్లు వేసింది.

    గుంజన్ సక్సేనా గురించి కంగన

    గుంజన్ సక్సేనా గురించి కంగన

    గుంజన్ సక్సేనా చిత్రం గురించి కంగన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మంచి చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వెండితెరపైన తీసిన విధానం, అనుసరించి తీరు అభ్యంతరకరం. ఓ సైనికురాలి జీవితాన్ని గొప్ప చిత్రకరించడంలో విఫలమయ్యారు. దేశ ప్రతిష్టను, సార్వభౌమాధికారాన్ని కాపాడిన గుంజన్ సక్సేనా కేవలం తన వ్యక్తిగత సమస్యను అధిగమించినట్టు చూపించడం బాధాకరం అని అన్నారు.

    English summary
    Bollywood fire brand actress Kangana Ranaut lashes out Karan Johar over patriotism in Gunjan Saxena. Kangana wrote a satirical poem on Karan Johar. Kangana Said in poem that Films based on war with Pakistan earn money so we will make such films but the villains in these will still be Indian.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X