కొత్త అవతారం ఎత్తిన కంగనా.. ఆ సినిమా పేరునే వాడుతూ రంగంలోకి!

నిత్యం వివాదాలతో కాపురం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సహా మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే కంగనా రనౌత్ అంటే తెలియని వారు ఉండరు. ఒకపక్క రైతుల సమస్యలు మరోపక్క బాలీవుడ్ సమస్యలు గురించి మాట్లాడుతూనే మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటూ బిజెపికి సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు.. అయితే తాజాగా ఆమె మరో కొత్త అవతారం ఎత్తింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఒక పార్టీకి టార్గెట్ గా

ఒక పార్టీకి టార్గెట్ గా

బాలీవుడ్లో ఎవరి మాట వినకుండా ఒక రెబల్ లా మారిపోయిన కంగనా రనౌత్ నిజానికి మంచి నటి.. చాలా చాలెంజింగ్ పాత్రలలో నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించింది. నటన విషయం పక్కన పెడితే ప్రస్తుతం సామాజిక అంశాల మీద ఆమె స్పందిస్తూ కొంతమందికి టార్గెట్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ మరణం సహా అనేక విషయాల గురించి ఆమె మాట్లాడుతూ మహారాష్ట్రలో ఒక పార్టీకి టార్గెట్ గా మారిపోయారు.

2006లో బాలీవుడ్ ఎంట్రీ

2006లో బాలీవుడ్ ఎంట్రీ

2006లో గ్యాంగ్ స్టర్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ మంచి నటి. అలాగే ఆమె కథక్ డాన్సర్ కూడా.. ఆమె రాజేంద్ర చతుర్వేది ఆధ్వర్యంలో నడిచే నటేశ్వర్ కళామందిరంలో నాలుగేళ్లపాటు కథక్ నృత్యాన్ని అభ్యసించింది.. అంతేకాదు ఈమెలో మరో టాలెంట్ కూడా ఉంది. ఈమె క్వీన్ అనే సినిమాకు సహ రచయితగా కూడా పని చేసింది. ఈ సినిమా 2014 జాతీయ అవార్డు కూడా సంపాదించింది.

అవార్డులు రివార్డులు

అవార్డులు రివార్డులు

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే 22 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న పిన్న వయస్కులైన నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2008లో రిలీజ్ అయిన ఫ్యాషన్ మూవీలో పోషించిన పాత్రకు కంగనా ఉత్తమ సహాయ నటి విభాగంలో మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత 2014లో 'క్వీన్' సినిమాలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మళ్లీ 2015 లో 'తను వెడ్స్ మను రిటర్న్' లో నటనకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు ను అందుకుంది. మళ్ళీ 2020లో 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ' మరియు 'పంగా' చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

మణికర్ణిక ప్రొడక్షన్స్

మణికర్ణిక ప్రొడక్షన్స్

అయితే ఇప్పుడు తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన మణికర్ణిక సినిమా పేరుతో ఆమె ఒక ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టింది. కానీ మొదటి వెంచర్ థియేటర్ రిలీజ్ సినిమా కాకుండా డిజిటల్ రిలీజ్ సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీ 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు కంగనా తెలిపింది. నిజానికి నటనతో పాటు కంగనా రనౌత్ కు నిర్మాణం, దర్శకత్వం మీద కూడా అవగాహన ఉంది, అంతకన్నా ఎక్కువ ఇంటరెస్ట్ కూడా ఉంది.

Recommended Video

Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards
దర్శకత్వం కూడా

దర్శకత్వం కూడా

'మణికర్ణిక' చిత్రం నిర్మాణ సమయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు క్రిష్ తప్పుకున్న వెంటనే కంగనా రనౌత్ రంగంలోకి దిగి దాన్ని పూర్తి చేసి విడుదల చేసింది. ఇక అంతే ఈ మేరకు బ్యాన‌ర్ టైటిల్ లోగోని కూడా అభిమానుల‌తో పంచుకుంది కంగనా. కంగనా 2014 లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో డైరెక్షన్.. స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ చేసింది. ఫ్యూచర్ లో డైరెక్టర్ అవుతానని గతంలో వెల్లడించింది. చూడాలి ఆ పని ఎప్పుడు చేస్తుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X