కంగనా శాపమే అంత పని చేసిందా.. పాత వీడియోలు వైరల్
వివాదాస్పద నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభమే. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త కోణం
ఇప్పుడు దేశం మొత్తం మహారాష్ట్ర వంక ఆసక్తికరంగా చూస్తోంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ - ఎన్సీపీ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఇప్పుడు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి. ఏక్ నాథ్ షిండే అనే ఒక మంత్రి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి ఒప్పుకోని ఉద్ధవ్ థాక్రే పదవి నుంచి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ రాజకీయ అనిశ్చితికి కారణం బీజేపీ అంటూ కొందరు అంటుంటే మరి కొందరు ఏకంగా కొత్త వాదన తెర మీదకు తెచ్చారు.

ఆమె శాపమే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పెట్టిన శాపమే అంటున్నారు. ఆమె కన్నీళ్లు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించాయి అని అంటున్నారు. ఉద్దవ్ థాక్రే సీఎంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి దాదాపుగా కన్ఫర్మ్, అందుకే ఆయన అధికారిక నివాసాన్ని కూడా వీడారు. ఏక్ నాథ్ షిండే వెనుక నడిచిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లో ఉద్ధవ్ థాక్రేకి మద్దతు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పడంతో ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ అతి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని అంటున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కంగనా రనౌత్ పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో శివ సేన మీద దండెత్తి పెద్ద ఎత్తున విమర్సలు చేసింది. ఆ తరువాత బీజేపీకి మద్దతుగా శివసేన పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. ఈ సమయంలో కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకుని ఆమె ఆఫీస్ ను బృహన్ ముంబయి అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కూల్చేశారు.

వీడియోలు వైరల్
ఆ తరువాత కోర్టు ఆమెకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే కంగనా ఆ సమయంలో ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కనుక ఇలా చేశారు, ఆ అధికారం నీకు ఎప్పటికి ఉండదు అని గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించింది. మరో వీడియోలో ఆమె మాట్లాడుతూ ఒక మహిళను బాధ పెట్టిన ఏ ఒక్కరు సుఖ పడ్డట్లు.. సంతోషంగా ఉన్నట్లుగా చరిత్రలో లేదు. కౌరవులు, రావణాసురుడు అంటూ ఉదాహరణలు కూడా చెప్పింది.

త్వరలో పతనం
త్వరలోనే మీ పతనం ఉంటుందని కంగనా ఆ సమయంలో ఎమోషనల్ అయింది. ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ అప్పటి వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం సంక్షోభం విషయంలో కంగనా ఎలా స్పందిస్తుందో అని కొందరిలో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











