Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జయలలిత బయోపిక్ అఫీషియల్: ‘తలైవి’గా కంగనా రనౌత్
'మణికర్ణిక' చిత్రంతో ఇటు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అటు దర్శకురాలిగా కూడా తెరంగ్రేటం చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సినిమా పూర్తయిన వెంటనే తన బయోపిక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్టు వర్క్ జరుగుతుండగానే ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... కంగనా రనౌత్ త్వరలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
తలైవి
‘తలైవి' పేరుతో జయలలిత బయోపిక్ రాబోతోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీలో రూపొందించబోతున్నారు. కంగనాతో ఈ పాత్ర చేయించడం ద్వారా కేవలం సౌత్ ప్రేక్షకులకే కాదు బాలీవుడ్లో కూడా ఎక్కువ మందికి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు.
కంగనా బర్త్ డే అనౌన్స్మెంట్
మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘తలైవి' మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న జీవి ప్రకాష్ ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా కంగనా రనౌత్ తలైవిగా నటించబోతున్న విషయాన్ని బ్రేక్ చేశారు.
|
జీవి ప్రకాష్ ట్వీట్
జీవి ప్రకాష్ ట్వీట్ చేస్తూ... ‘గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ తర్వాత మళ్లీ హిందీలో ‘తలైవి' చిత్రంతో అడుగు పెడుతున్నాను. కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విబ్రి మీడియా, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. కంగనా రనౌత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.
జయ కుటుంబ సభ్యుల నుంచి అనుమతి
‘తలైవి' సినిమా తీస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు జయలలిత కుటుంబం నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకున్నారు. గత 9 నెలులుగా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలపై రీసెర్చ్ చేస్తున్నారు. స్కిప్టు చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో...
బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథ అందించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ‘తలైవి' మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మాధవన్ కార్కే లిరిక్స్ రాస్తున్నారు.