twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలిత బయోపిక్‌ అఫీషియల్: ‘తలైవి’గా కంగనా రనౌత్

    |

    'మణికర్ణిక' చిత్రంతో ఇటు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అటు దర్శకురాలిగా కూడా తెరంగ్రేటం చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సినిమా పూర్తయిన వెంటనే తన బయోపిక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్టు వర్క్ జరుగుతుండగానే ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చింది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... కంగనా రనౌత్ త్వరలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

    తలైవి

    తలైవి

    ‘తలైవి' పేరుతో జయలలిత బయోపిక్ రాబోతోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీలో రూపొందించబోతున్నారు. కంగనాతో ఈ పాత్ర చేయించడం ద్వారా కేవలం సౌత్ ప్రేక్షకులకే కాదు బాలీవుడ్లో కూడా ఎక్కువ మందికి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు.

    కంగనా బర్త్ డే అనౌన్స్మెంట్

    కంగనా బర్త్ డే అనౌన్స్మెంట్

    మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘తలైవి' మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న జీవి ప్రకాష్ ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా కంగనా రనౌత్ తలైవిగా నటించబోతున్న విషయాన్ని బ్రేక్ చేశారు.

    జీవి ప్రకాష్ ట్వీట్

    జీవి ప్రకాష్ ట్వీట్ చేస్తూ... ‘గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ తర్వాత మళ్లీ హిందీలో ‘తలైవి' చిత్రంతో అడుగు పెడుతున్నాను. కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విబ్రి మీడియా, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. కంగనా రనౌత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.

    జయ కుటుంబ సభ్యుల నుంచి అనుమతి

    జయ కుటుంబ సభ్యుల నుంచి అనుమతి

    ‘తలైవి' సినిమా తీస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు జయలలిత కుటుంబం నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకున్నారు. గత 9 నెలులుగా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలపై రీసెర్చ్ చేస్తున్నారు. స్కిప్టు చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

    విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో...

    విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో...

    బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథ అందించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ‘తలైవి' మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మాధవన్ కార్కే లిరిక్స్ రాస్తున్నారు.

    English summary
    Kangana Ranaut is all set to play the late chief minister J Jayalalithaa in director AL Vijay's Thalaivi, which is based on the politician's life. "After #gangsofwasseypur this will be my venture back into Hindi .. #GV72 #KanganaRanaut will play the lead role in #Thalaivi, the #Jayalalithaabiopic produced by vibri_media vishinduri and directed by #Vijay #Vijayendraprasad #NiravShah gvprakash #HBDKanganaRanaut (sic)" GV Prakash tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X