twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీబీఐకి సుశాంత్‌ కేసు.. బీహార్ సర్కార్ దూకుడు.. స్వాగతించిన కంగన రనౌత్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తుకు సంబంధించి మార్పులు వేగంగా చోటుచేసుకొంటున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టడానికి వెళ్లిన తమ పోలీసులను క్వారంటైన్‌కు పంపుతూ ముంబై పోలీసుల చేసిన చర్యలపై బీహార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అంతేకాకుండా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం నితీష్ కుమార్ సిఫారసు చేయడంపై సినీ వర్గాలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయంపై కంగన రనౌత్ టీమ్ స్పందిస్తూ..

     టీమ్ కంగన రనౌత్ హర్షం

    టీమ్ కంగన రనౌత్ హర్షం

    సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫారసు చేయడంపై కంగన టీమ్ ట్వీట్ చేసింది. ఈ కేసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మానవత్వం, జాతి, దేశ ప్రజలు సాధించిన విజయం అంటూ ట్వీట్ చేశారు. బీహార్ సీఎం నితీష్ నిర్ణయాన్ని స్వాగతించారు.

     సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత బీహార్‌దే

    సుశాంత్ కేసు దర్యాప్తు బాధ్యత బీహార్‌దే

    రిపబ్లిక్ టెలివిజన్‌తో బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. సుశాంత్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇప్పుడు ఆ కేసును దర్యాప్తు చేయాల్సిన బాధ్యత బీహార్ పోలీసులపై ఉంది. ఒకవేళ వారు సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరితే వెంటనే అందుకు ఆమోదం తెలియజేస్తాం అని అన్నారు.

    సుశాంత్ ఫ్యామిలీ సమ్మతితో

    సుశాంత్ ఫ్యామిలీ సమ్మతితో

    సీబీఐ దర్యాప్తు అప్పగించడంపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే డీజీపీలో మాట్లాడాం. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సిఫారసు చేస్తున్నాం. అందుకు సుశాంత్ ఫ్యామిలీ సమ్మతి కూడా ఉంది. ఈ రోజు నుంచే ఆ ప్రాసెస్ మొదలవుతుంది. ప్రొసీడింగ్స్ కూడా మొదలుపెట్టాం అని నితీష్ కుమార్ చెప్పారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    వినయ్ తీవారితో వ్యవహరించిన తీరుపై

    వినయ్ తీవారితో వ్యవహరించిన తీరుపై

    సుశాంత్ కేసును దర్యాప్తు చేయడానికి వెళ్లిన మా ఐపీఎస్ అధికారిని ముంబై పోలీసులు క్వారంటైన్ చేశారు. ఒక ఉన్నతాధికారి వినయ్ తీవారితో వ్యవహరించాల్సిన తీరు కాదు. అలాంటి చర్యను అనుమతించే ప్రసక్తే లేదు. దర్యాప్తు చేసే అధికారితో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ సీఎం నితీష్ మండిపడ్డారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని మేము భావిస్తున్నామని పేర్కొన్నారు.

    English summary
    Bollywood actress Kanagana Ranaut praises on Bihar governement decision to recommend the CBI probe for Sushant Singh Rajput case. She has welcomed CM Nithish Kumar decision on this case. She said its win of Humanity, nation, People.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X