రాహుల్ గాంధీ అలా చేస్తే.. ఆయనను పెళ్లి చేసుకొంటా.. కంగన రనౌత్ క్లారిటీ

సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోను ఫైర్ బ్రాండ్‌గా కొనసాగుతున్న కంగన రనౌత్ మరోసారి జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఇంకా బ్రహ్మాచారి అయిన ఆమె, రాహుల్ గాంధీ పెళ్లి వ్యవహారం మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. అయితే కంగన రనౌత్ చెప్పినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఓ పోస్టు సినీ, రాజకీయ వర్గాలను గందరగోళానికి గురి చేసింది. అయితే రాహుల్ గాంధీని పెళ్లి చేసుకొంటాననే విధంగా ఉన్న ఆ స్టేట్‌మెంట్ వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రాహుల్ గాంధీతో పెళ్లి వ్యవహారం, వివాదం వెనుక వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, సినీ నటి పరిణితి చోప్రా భర్త రాఘవ్ చద్దా ఇటీవల బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. ఆ క్రమంలో ఓ ఫేక్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టులో పేర్కొన్న ప్రకారం.. రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరితే.. ఆయనను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్దమే అనే విధంగా పోస్టు వైరల్ అయింది. ఆ పోస్ట్ అందర్నీ ఆకర్షించడంతో భారీ చర్చకు దారి తీసింది.

Kangana Ranaut Wedding with Rahul Gandhi

అయితే రాహుల్ గాంధీని వివాహం చేసుకొంటానని తాను అనలేదని ఎంపీ, సినీ నటి కంగన రనౌత్ క్లారిటీ ఇచ్చారు. ఇంత దారుణంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారా? కొంతైనా సభ్యత, సంస్కారం ఉండాలి. రాజకీయాల్లోను మహిళలకు గౌరవం ఉండదా? మహిళ మనోభావాలతో ఆడుకొంటారా? ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించడం సిగ్గుచేటు అంటూ కంగన రనౌత్ తన స్పందనను, ఆవేదనను వ్యక్తం చేశారు. రాహుల్‌ అంటే తనకు గౌరవమని.. బాధ్యతాయుతమైన జీవితాన్ని కొనసాగించే వారిపై ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దు అని సలహా ఇచ్చారు.

కంగన రనౌత్ పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అగ్ర నటిగా కొనసాగుతుండగానే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. 2024 సంవత్సరంలో ఏర్పాటైన లోక్‌సభలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. కంగన రనౌత్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ఇటీవల ఆమె నటించిన దాకడ్, తలైవీ, పంగా, చంద్రముఖి 2, తేజాస్, ఎమర్జెన్సీ చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. ప్రస్తుతం ఆమె సర్కిల్, భారత భాగ్య విధాత, క్వీన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X