క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కంగన రనౌత్ ఫిదా.. సచిన్, విరాట్ కోహ్లిని మించి..
బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ నటించిన ఎమోషనల్ డ్రామా భారత్ భాగ్య విధాత. 26/11 ముంబై బాంబు పేలుళ్ల సంఘటనలో నర్సుల సేవలు బ్యాక్ డ్రాప్‌గా రూపొందింది. ఈ సినిమాలో గిరిజా ఓక్, స్మిత తాంబే, అమృత నామ్‌దేవ్, ఇషా డియో, సుహిత తట్టే తదితరులు నటించారు. ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస క్రియేషన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై డాక్టర్ జయంతిలాల్ గడా నిర్మించారు. కంగన రనౌత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: అమన్ పంత్, ఎడిటర్: దేవ్ రావు జాదవ్, యాక్షన్ డైరెక్టర్: సునీల్ రోడ్రిగ్స్, సౌండ్ ఇంజినీర్: నిహార్ రంజన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న సినిమా ప్రమోషన్స్‌లో కంగన రనౌత్ పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. యువ క్రికెట్ సంచలనం గురించి ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే?

ఎంపీగా, సినీ నటిగా రాజకీయాలు, సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల క్రికెట్ ఆటను చూసే సమయం చిక్కడం లేదు. అయితే యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి నాకు చాలా విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. యువ సంచలన గురించి ఎక్కువగా తెలియకపోయినా అతడి ప్రతిభ గురించి తక్కువగా మాట్లాడటం, అతడిని నిరుత్సాహ పరచడం నాకు ఇష్టం లేదు. వైభవ్ ఆడిన మ్యాచులు చూడటానికి వీలు కలుగలేదు. కానీ అతడు దేశం తరఫున బాగా ఆడాలని, రాణించాలని కోరుకొంటున్నాను అని కంగన రనౌత్ అన్నారు.
భారత్ క్రికెట్ జట్టుకు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాదిరిగానే ప్రపంచ క్రికెట్‌లో తన సత్తాను చాటాలి. వారి కంటే గొప్పగా ఆడాలి. మనకు ప్రపంచకప్‌ను సాధించిపెట్టాలని కోరుకొంటున్నాను. ఆయనపై ఒత్తిడి పెట్టకూడదు. 15 యువ క్రికెటర్ మరిన్నీ అద్బుతాలు క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు.
భారత భాగ్య విధాత సినిమాలో నర్సుల జీవితాలను అద్బుతంగా ఆవిష్కరించాం. సాధారణంగా నర్సుల అంటే.. వారి వృత్తి అంటే చిన్నచూపు చూస్తారు. వారు ధరించే దుస్తులు, వారిని లైంగిక కోరికలు తీర్చే ఆట వస్తువులుగా మాత్రమే చూస్తారు. ఈ సినిమాలో నర్సుల జీవన విధానం, వారి త్యాగం చూసిన తర్వాత వారిని ఉన్నతంగా చూసే పరిస్థితి వస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా మాత్రమే చూస్తారు అని ఆమె అన్నారు.
సాధారణ యువతి పాత్రలను పోషించడానికి ప్రధాన కారణం.. నేను అలాగే కనిపిస్తాను కాబట్టి ఆ పాత్రలకు సరిపోతాను. అలాగే నేను సినిమా పరిశ్రమలోకి వచ్చిన సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లు, దేవతల మాదిరిగా కనిపించే అందెగత్తెలు సినిమా పరిశ్రమలో ఉన్నారు. కాబట్టి మధ్య తరగతి యువతి పాత్రలు నన్ను వెతుక్కొంటూ వచ్చాయి అని కంగన రనౌత్ అన్నారు.


Click it and Unblock the Notifications