ఆ కేంద్ర మంత్రితో ఎఫైర్‌? షాకింగ్ రిప్లై ఇచ్చిన కంగనా

బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫైర్ బ్రాండ్ సినిమాల్లో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. మూవీస్ తో సంపాదించుకున్న క్రేజ్ తో రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసిన కంగనా ఎంపీ గా గెలిచి అందరికీ తానేంటో మళ్ళీ నిరూపించింది. అయితే.. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు ఘాటు స్టేట్‌మెంట్‌తో ఫుల్ స్టాప్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో తనకు ప్రేమాయణం నడుస్తోందన్న ప్రచారంపై కంగనా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

రూమర్లకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్
గత కొద్ది నెలలుగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ల మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో వీరిద్దరూ పలకరించుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం వంటి విజువల్స్ వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. మిలే నా మిలే హమ్' (2011) చిత్రంలో కలిసి నటించిన ఈ మాజీ సహనటులు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా పక్కపక్కనే కనిపిస్తుండటంతో వీరి మధ్య 'రోమాన్స్' మొదలైందంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్‌లు వెల్లువెత్తాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించిన కంగనా రనౌత్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

Kangana Ranaut Reacts to Chirag Paswan Rumours Says No Romance Just Friendship

కంగనా తనదైన స్టైల్‌లో సెటైరికల్‌గా మాట్లాడుతూ, "లేదు, చిరాగ్ పాశ్వాన్ నా మంచి స్నేహితుడు మాత్రమే. అతడిని చూసినప్పుడు నాకు ఒక మంచి మిత్రుడు కనిపిస్తాడు తప్ప, మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. నిజం చెప్పాలంటే.. మా మధ్య ప్రేమ ఉండి ఉంటే, ఈపాటికి మాకు పిల్లలు ఉండేవారు. మా పరిచయం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితమే మేం కలిసి సినిమా చేశాం" అని అన్నారు. ఇద్దరూ మిలే నా మిలే హమ్' అనే సినిమాలో కలిసి నటించారని, అప్పటి నుంచి స్నేహం కొనసాగుతుందని చెప్పారు. సినిమా నేపథ్యం నుంచి రావడం వల్ల ఒకరికొకరికి అర్థం చేసుకునే అనుబంధం ఉందని, అది పూర్తిగా స్నేహపూర్వకమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు.

చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజకీయాలపై తరచూ పక్కపక్కనే కనిపించడం, మాట్లాడుకోవడం సహజమని, దానికే రొమాంటిక్ అర్ధం తీసుకోవడం సరైంది కాదని కంగనా హెచ్చరించారు. ప్రస్తుతం కంగనా చేసిన "పిల్లలు పుట్టేవాళ్లు" అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఆమె స్పష్టతను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ స్టేట్‌మెంట్‌ను సెటైరికల్‌గా తీసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలతో కంగనా-చిరాగ్ మధ్య ఉన్న రూమర్లకు పెద్దగా బ్రేక్ పడినట్టే.

ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ
ఇక కంగనా సినీ, రాజకీయ జీవితాలను సమాంతరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కూడా పలు క్రేజీ ప్రాజెక్టులతో ఉన్నారు. 'భారత్ భాగ్య విధాత' వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, క్వీన్ సీక్వెల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. కంగన చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ రూమర్లకు ముగింపు పడుతుందా? లేక మళ్లీ కొత్తగా ప్రచారం మొదలవుతుందా? అనేది చూడాలి. అయితే ప్రస్తుతం ఆమె క్లియర్ స్టేట్‌మెంట్‌తో సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X