లీగల్ యాక్షన్ పై తలైవి సెటైర్... మహానాయకురాలైనెట్టేనంటూ కౌంటర్
కాంట్రావర్షియల్ ట్వీట్స్ చేస్తూ కొరివితో తలగోక్కోవడం కంగనా రనౌత్ కు మహా సరదా అనడంలో సందేహమేలేదు. తాజాగా రైతుల పోరాటంపై వివాదాస్పదమైన ట్వీట్ చేసి అభాసుపాలైన కంగనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై అమ్మడు మరోసారి తనదైన స్టైల్ లో స్పందించింది.
ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న రైతుల నిరశన ప్రదర్శనలో కేవలం వందరూపాయిలు తీసుకుని బిల్కిస్ బానో కూడా పాలుపంచుకున్నారని ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కంగన, అది ఫేక్ అని తెలియడంతో కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఇక అప్పటి నుంచి తలైవిపై విమర్శల వర్షం కురుస్తోంది. పంజాబీ స్టార్ హీరో దల్జీత్ దోసాంజ్ ఆమెపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. తాజాగా ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా కంగనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వగా, ఢిల్లీ సిఖ్ గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ కూడా లీగల్ నోటీసులు పంపింది.

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన కంగన ఫిల్మ్ మాఫియా తనపై ఎన్నో కేసులను బనాయించిందని, మహారాష్ట్ర ప్రభుత్వం తనపై గంటకో కేసు వేస్తోందని, ఇప్పుడు పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరితో చేతులు కలిపిందంటూ ట్వీట్ చేసింది. చూడబోతే వీరందరూ కలసి తననో మహా నాయకురాలిని చేసే వరకూ నిద్రపోయేలా లేరని సెటైరికల్ గా ట్వీట్ చేసింది.
మరోవైపు కెరీర్ పరంగా సూపర్ బిజీగా ఉన్న కంగనా రనౌత్, ప్రస్తుతం తేజస్ సినిమా షూటింగ్ లో పాలుపంచుకుంటోంది. ఇటీవలే తలైవి షూటింగ్ పూర్తవ్వగా త్వరలోనే అది విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











