పెళ్లైన హీరోతో అక్రమ సంబంధం.. 6 నెలలు వెంటపడి.. కంగన షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ముక్కుసూటి తనంతో ఏం మాట్లాడినా సంచలనం రేపుతుంది. తనను వేధించే వారిని వదిలిపెట్టకుండా మాటలతో రఫ్ ఆడిస్తుంది. అయితే ఇండస్ట్రీలో తనతో వ్యవహరించే వారికి తనదైన శైలిలో స్పందిస్తూ వారికి గట్టి షాక్స్ ఇచ్చేలా చేస్తుంది. అయితే కంగన నటించిన ఎమర్జెన్సీ సినిమా విజయ పథంలోకి కొనసాగుతుండగా ఆమె మాట్లాడిన పాత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. బాలీవుడ్ హీరోతో ఆమె తన డేటింగ్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో కంగన రనౌత్‌కు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ. నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొన్నది. తన విజయాలను చూసి తట్టుకోలేని వారిపై అలాగే తనపై ఆరోపణలు విమర్శలు చేసే వారికి తనదైన రీతిలో జవాబిచ్చడం చూశాం. గతంలో మహేష్ భట్ లాంటి వాళ్లు తనతో ఎంత అసభ్యంగా ప్రవర్తించారో అనే విషయాన్ని టెలివిజన్ ఛానెల్స్ బహిరంగ చర్చలో బయటపెట్టారు.

Kangana Ranaut reveals affair and rift with Hrithik Roshan at Kite and Krissh 3 Move

అయితే ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన రనౌత్ మాట్లాడుతూ.. నాతో విభేదాలు, సమస్యలు ఉంటే.. నా బర్త్ డే పార్టీలో హృతిక్ ఎగిరి ఎగిరి సంతోషంలో డ్యాన్స్ చేశాడు. నా తాగుబోతును, మానసిక సమస్యలు ఉన్నాయి. నేను తప్పుగా బిహేవ్ చేస్తానని చెప్పినప్పుడు.. నాతో కైట్ సినిమా చేసిన తర్వాత కూడా క్రిష్ 3 సినిమా కోసం నా డేట్స్ గురించి నా వెంట ఎందుకు పడ్డావు అని నిలదీసింది.

హృతిక్ వివాహితుడు. ఆయనతో నాకు అక్రమ సంబంధం ఉంది. నాకు ఆయనకు మధ్య అఫైర్ ఉంది. అందుకే ఇలాంటి అఫైర్ గురించి దూరంగా ఉండాలని ఆయన సినిమాలో నటించడానికి ఓప్పుకోలేదు. నేను ఆయన నటించే క్రిష్ 3 సినిమాను రిజెక్ట్ చేస్తే.. ఆరు నెలలు నా వెంటపడి నటింప జేయడానికి తంటాలు పడ్డాడు. నాతో ప్రాబ్లెం ఉంటే ఆయన నా వెంట ఎందుకు పడ్డాడు అని కంగన ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది.

Kangana Ranaut reveals affair and rift with Hrithik Roshan at Kite and Krissh 3 Move

2000 సంవత్సరంలో హృతిక్‌పై కంగన, కంగనపై హృతిక్ చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపాయి. వారిద్దరూ ఒకరిపై మరొకరు కూడా కేసులు నమోదు చేసుకొన్నారు. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఆధారాలు లేకపోవడం వల్ల వాటిని కోర్టు కొట్టివేసింది. దాంతో హృతిక్, కంగన మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగాయి. ఆ సమయంలో హృతిక్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడం గమనార్హం.

ఇక ఇదిలా ఉంటే.. కంగన రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందిరా గాంధీ జీవితంలో చోటుచేసుకొన్న కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ క్రమంలో ఆమె పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న సంబంధం గురించి క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X