‘ఆ సూపర్ హీరో‌కు డ్రగ్స్ పిచ్చి.. ఆరోగ్యం విషమించి హాస్పిటల్‌లో.. అందుకే భార్య విడాకులు’

డ్రగ్ మాఫియాతో బాలీవుడ్‌ సంబంధాలపై సంచలన ఆరోపణలు చేస్తున్న ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి టాప్ హీరోపై ధ్వజమెత్తారు. గతంలో డేటింగ్ చేసిన బాలీవుడ్ అగ్ర హీరో డ్రగ్ వాడకం అలవాట్లపై కంగన షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తాజాగా జాతీయ మీడియాకు సంబంధించిన ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్బ్రాంతికరమైన విషయాలను కంగన వెల్లడిస్తూ..

బాలీవుడ్ సూపర్ హీరో డ్రగ్స్ వాడి..

బాలీవుడ్ సూపర్ హీరో డ్రగ్స్ వాడి..

బాలీవుడ్‌లో సూపర్ హీరోగా పేరున్న ఆయన పేరును చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆయన నటించిన చిత్రంలో నేను ఓ చిన్న పాత్రను పోషించాను. లాస్ వెగాస్‌లో జరిగిన షూటింగులో నేను కూడా ఉన్నాను. ఆ సమయంలో ఆయనకు ఓ విదేశీ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. వారిద్దరు కలిసి ఉండేవాళ్లు. రాత్రంతా పార్టీలు చేసుకొనే వారు. డ్రగ్స్‌ను నీళ్ల కంటే దారుణంగా ఉపయోగించే వారు. ఎల్ఎస్‌డీ, కొకైన్, ఎక్‌స్టాసీ పిల్స్ రోజంతా ఉయోగించే వారు అని కంగన తెలిపారు.

 డ్రగ్స్ వాడకంతో హాస్పిటల్‌లో చేరాడు

డ్రగ్స్ వాడకంతో హాస్పిటల్‌లో చేరాడు

ఆ హీరోకు ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉంది. ఆ కారణంగా ఆరోగ్యం దారుణం క్షీణించి ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేరారు. ఆ హీరో డ్రగ్స్ వాడే తీరు, ఇతర అలవాట్లపై విరక్తి చెందిన ఆయన భార్య విడాకులు ఇచ్చింది. అలాంటి బాలీవుడ్ నటుడితో గతంలో డేటింగ్ చేశాను. ఆ తర్వాత నన్ను కూడా ఆ హీరో, ఆయన ఫ్యామిలీ నన్ను జైల్లో పెట్టడానికి ప్రయత్నించారు అని కంగన చెప్పారు.

 భార్యతో ఆ హీరో మళ్ళీ సహజీవనం

భార్యతో ఆ హీరో మళ్ళీ సహజీవనం

బాలీవుడ్ హీరో డ్రగ్స్ వాడకం, చాలా మందితో రిలేషన్స్, అఫైర్ల కారణంగా ఆయన భార్య విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్‌తో బాధపడ్డారు. వారు విడాకులు తీసుకోవడానికి ఆయన తండ్రి ఒప్పుకోలేదు. వారి ఇద్దరి పిల్లలకోసమైనా కలిసి ఉండాలని కోరాడు. విడాకులు తర్వాత వారిద్దరి ఇప్పుడు కలిసే ఉంటున్నారు. వారు కలిసి ఉండేది డబ్బు కోసమా? మరో విషయం కోసమా అనేది వాళ్లే సమాధానం ఇస్తే బాగుంటుంది అని కంగన పేర్కొన్నారు.

ఆ హీరోతో డేటింగ్ చేస్తున్నానని తెలిసి

ఆ హీరోతో డేటింగ్ చేస్తున్నానని తెలిసి

బాలీవుడ్ హీరో‌కు భార్య విడాకులు ఇచ్చి ఆమె స్వతంత్రంగా బతుకుతున్నారు. అలాంటి సమయంలో ఆయనతో ఓ సినిమాలో నటించాను. ఆ సందర్భంగా ఆ హీరోకు దగ్గరయ్యాను. అప్పటి నుంచి మా మధ్య అఫైర్ కొనసాగింది. ఆ హీరోతో డేటింగ్ చేస్తున్నాననే విషయం బయటకు తెలిసిన తర్వాత బాలీవుడ్ వర్గాలు నన్ను పార్టీలకు ఆహ్వానించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అవుట్ సైడర్‌గా నన్ను వెలివేశారు అని కంగన అన్నారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
99 శాతం మందికి డ్రగ్స్ అలవాటు

99 శాతం మందికి డ్రగ్స్ అలవాటు

బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతారు. తనకు గురువుగా చెప్పుకొనే ఓ దర్శకుడు నాకు డ్రగ్స్ రుచి చూపించారు. బాలీవుడ్‌లోని వ్యక్తులకు సంబంధం ఉన్న డ్రగ్స్ డీలర్స్‌ను విచారిస్తే.. టాప్ హీరోలు, హీరోయిన్లు జైల్లో ఉంటారు. బాలీవుడ్‌లోని టాప్ సెలబ్రిటీలందరూ డ్రగ్స్ వాడుతారు అని కంగన సంచలన విషయాలు బయటపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X