కంగనా రనౌత్ విశ్వరూపం.. వీరనారిగా అద్భుత విన్యాసాలు.. అంచనాలు పెంచేలా మణికర్ణిక టీజర్!
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వీర నారిగా మారింది. నటనకు ప్రాధాన్యత ఉన్నపాత్రలని ఎంపిక చేసుకోవడంలో కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. వారియర్ క్వీన్ ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్రలో నటిస్తోంది.
నేడు మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా మణికర్ణిక టీజర్ విడుదల చేశారు. కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మి భాయ్ వీరత్వానికి తగ్గట్లుగా అద్భుత నటన కనబరుస్తోంది. పోరాట సన్నివేశాల్లో కంగనారనౌత్ విశ్వరూపం ప్రదరిస్తోందా అన్నట్లుగా ఆమె ఫెర్ఫామెన్స్ ఉంది. బ్రిటిష్ వారిపై యుద్ధ సన్నివేశాల్లో కంగనా రనౌత్ చెలరేగిపోయింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ని విడుదల చేశారు. తెలుగు డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించారు. జనవరి 25 న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.



Click it and Unblock the Notifications











