నా సినిమాలిమ్మని అడుక్కుంటోంది.. ఆ హీరోయిన్ మీద కంగనా షాకింగ్ కామెంట్స్!
ట్విట్టర్ తన అకౌంట్ ని రద్దు చేయడంతో ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్న కంగనా రనౌత్ తనను టార్గెట్ చేస్తున్న అందరి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆమె ఈసారి తాప్సీ పన్నుని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

తాప్సీని టార్గెట్ చేస్తూ
తాప్సీ పన్ను తన గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించారు. ఇటీవల తాప్సీ, హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా ట్విట్టర్‌లో లేకపోవడాన్ని తను మిస్ అవ్వడం లేదని, ఎందుకంటే ఆమెకు 'నా జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు' అని అన్నారు. ఈ అంశం గురించి స్పందిస్తూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

నా సినిమాలిమ్మని అడుక్కుంటోంది
ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా స్పందించింది. కంగనా రనౌత్ తాప్సీ పన్ను కామెంట్స్ పై స్పందిస్తూ , కంగనా తిరస్కరించిన సినిమాల కోసం నిర్మాతలను తాప్సీ 'వేడుకుంటోంది' అని పేర్కొంది. "ఆమె నిర్మాతలను పిలిచి, కంగనా జి నే కుచ్ చోడా హై తో ముజే దేదో ప్లీజ్, ఔర్ ర్ ఆజ్ ఇస్కీ ఆకత్ దేఖో, జో కబీ గరీబ్ నిర్మాత కి కంగనా కెహ్లానే మెయి భీ ప్రౌడ్ ఫీల్ కర్తీ థి ... ఆజ్ ముజే హే ఇర్రిలవెంట్ కెహ్ రహీ ఉస్కీ ఫిట్రాట్ అజీబ్ హై అంటూ హిందీలో కామెంట్ చేసింది.

వింత స్వభావం
అంటే ఆమె(తాప్సీ) నిర్మాతలను పిలుస్తుంది మరియు నేను తిరస్కరించిన సినిమాలు ఇవ్వమని ఆమె వేడుకుంటుంది, మరియు ఈ రోజు ఆమెను చూడండి. పేద నిర్మాతలకు కంగనా వరం అని చెబుతూ గర్వపడింది, ఈ రోజు ఆమె నన్ను అసంబద్ధం అని అంటోంది, ప్రజలు మరియు వారి వింత స్వభావం ఎలా ఉందొ చూడండి అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఎప్పుడూ అగౌరవ పరచలేదు
ఏమైనప్పటికీ ఫిల్మ్ గర్ల్ తాప్సీ పన్ను నా పేరు లేకుండా ప్రచారం చేయడానికి ప్రయత్నించండి అంటూ కంగనా కౌంటర్ ఇచ్చింది. మరొక పోస్ట్‌లో, 'బి-గ్రేడ్ నటీనటులు' తన పేరును వాడుకుంటారని, 'తమను తాము ప్రోత్సహించు కోవడానికి', నా నుండి ప్రేరణ పొందడానికి అలా చేస్తారని కంగనా చెప్పుకొచ్చింది. తాను కూడా శ్రీదేవి, వహీదా రెహ్మాన్ వంటి నటుల నుండి కూడా ప్రేరణ పొందానని, అయితే 'వారిని ఎప్పుడూ అగౌరవ పరచలేదని' ఆమె అన్నారు.

బి గ్రేడ్ నటులే అలా
"బి గ్రేడ్ నటులు తమను లేదా వారి వృత్తిని ప్రోత్సహించడానికి నా పేరు లేదా నా గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం గురించి తనకు పెద్దగా పట్టింపు లేదని ఆమె పేర్కొంది. వాస్తవానికి వారు పరిశ్రమలో పెరుగుతున్న నా పేరును ఉపయోగించుకుంటారని, నేను కూడా అంతకుముందు ఉన్న స్టార్స్ నుంచి ప్రేరణ పొందానని ఆమె చెప్పుకొచ్చారు. మరి ఈ కామెంట్స్ మీద తాప్సీ ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











