‘Virat Kohli, అనుష్క.. నీ కూతుర్ని డేటింగ్‌కు పంపిస్తావా?’
బాలీవుడ్ నటి అనుష్క శెట్టి, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూతురును డేటింగ్‌కు పంపుతావా అని ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకొన్న సంఘటనపై కంగన రనౌత్ ఘాటుగా స్పందించింది. ఈ సంఘటన బెంగళూరు ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకొన్నది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..
విరాట్, అనుష్క కూతురు గురించి అనుచితంగా ప్రవర్తించిన బాలుడి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిల్లాడికి సరిగి బుద్దులు నేర్పించలేదంటూ సీరియస్ అయింది. ఆధునికత పేరుతో వల్గర్, ఫూలీష్ బుద్దులు నేర్పించకండి అంటూ కంగన ట్వీట్ చేసింది.

కంగనా రనౌత్ ఆ బాలుడి ఫోటో, ప్లకార్డును ట్వీట్ చేస్తూ... పసిపిల్ల వాళ్లకు చెడు బుద్దులు నేర్పించకు. పిల్లల మనసులో అశ్లీల భావాలు నాటకండి అంటూ ఘాటుగా స్పందించింది. అయితే కంగన రనౌత్ పోస్టుపై పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.
కంగన రనౌత్ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. పబ్లిసిటీ, చీప్ పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉండటం సిగ్గు చేటు. ఆ పోస్టర్‌లో రాసి ఉన్నది ఏమిటో కనీసం పిల్లలకు తెలియదు. అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











