ఆ హీరో వల్ల పెళ్లి మీద ఆశ కూడా చచ్చిపోయింది.. గుండు కొట్టించుకోవాలని అనుకున్నా: కంగనా
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుశాంత్ సింగ్ సూసైడ్ ఘటన నుంచి గ్యాప్ లేకుండా బాలీవుడ్ మాఫియాకు చెమటలు పట్టిస్తున్న కంగనా బడా స్టార్స్ ని కూడా ఏ మాత్రం విడిచిపెట్టడం లేదు. అలాగే తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా బయటకు చెబుతోంది. ఒక హీరో చేసిన పనికి సూసైడ్ చెసుకోవలని అనుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

హీరోయిన్స్ కూడా అంతే..
సుశాంత్ సింగ్ ఘటనపై రెగ్యులర్ గా స్పందిస్తున్న కంగనా పలువురి హీరోయిన్స్ పై కూడా ఘాటుగా స్పందిస్తోంది. బాలీవుడ్ మాఫియాకు వారి నుంచి కూడా మద్దతు అందుతోందని అందులో తాప్సి లాంటి వాళ్ళు కూడా ఉన్నారని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తాప్సి కూడా కంగనాకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఆ హీరో కావాలని..
ఒక నొక సందర్భంలో తాను కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పిన కంగాన తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. '2016లో నేను నటించిన సినిమాలు హిట్టవ్వగానే 18కి పైగా బ్రాండ్స్ కి ప్రచారకర్తగా ఉండే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు ఒక హీరో నా మీద కావాలని కేసు వేశాడు. అతను 2013లో నా నుంచి విడిపోయాడు.

చాలా బాధపడ్డాను
అతను కావాలని నా మీద తప్పుడు ప్రచారాలు చేశాడు. నేను ఒక మంత్రగత్తెను సైకోను మనుషులను చంపుకొని తినేదాన్ని అంటూ అందరికి చెప్పాడు. దీంతో నాకు వచ్చిన ఆఫర్స్ అన్నిటి నుంచి నన్ను తొలగించారు. అతని కారణంగా జీవితంలో చాలా బాధపడ్డాను. నా కుటుంబ సభ్యులు కూడా నన్ను కలవడానికి ఇష్టపడలేదు.
Recommended Video

పెళ్లి మీద ఆశ చచ్చిపోయింది
వ్యక్తీ కారణంగా ఆఫర్స్ చాలా వరకు తగ్గడంతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవలని అనిపించింది. పెళ్లి మీద ఆశ కూడా చచ్చిపోయింది. గుండు గీయించుకొని ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవాలని అనిపించిందని కంగనా తను ఎదుర్కొన్న పరిస్థితులు గురించి వివరణ ఇచ్చింది. ఇక కంగనా చేసిన వ్యాఖ్యలకు ఓ వర్గం వారి నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











