చీరకట్టులో చంపేస్తున్న కంగనా... వివాదాల నటిని ఇంత హాట్ గా ఎన్నడూ చూసి ఉండరు!
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఎందుకంటే ఆమె తెలుగు సినిమాలో సైతం హీరోయిన్ గా నటించింది. నటిగా చాలా టాలెంట్ కలిగి ఉన్న ఈ నటి, నటిగా కంటే కూడా వివాదాస్పద నటిగా ఎక్కువ పేరు తెచ్చుకుంది. హృతిక్ రోషన్ తో నిలబడుతుంది అనుకున్న బంధం బెడిసి కొట్టడంతో అప్పటి నుంచి ఆమె ఒక రాయి లాగా మారి పోయింది.. ఎవరిని, ఎందుకు, ఎప్పుడు, ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలాంటి భామ అప్పుడప్పుడు తన గ్లామర్ లుక్ ను కూడా బయట పెడుతూ ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే

వివాదాలతో వార్తల్లో
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే ఈ హిమాచల్ ముద్దుగుమ్మ ఎక్కువగా తన సినిమాలకంటే వివాదాలతోనే హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ కంగనా ఇటీవల ఎక్కువగా బయోపిక్స్ చేస్తూ అలరిస్తుంది. ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన కంగనా రనౌత్ తాజాగా జయలలిత బయోపిక్ అయిన 'తలైవి' చిత్రంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. అంతే కాక ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్న సినిమా కూడా ఒకటి సెట్స్ మీద ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి అంటే ఈ భామకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
రచ్చ రేపింది
అయితే ఈ భామ ఆ మధ్య ఈజిప్టులో ఒకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది. అయితే అన్ని విషయాల మీద విరుచుకు పడే కంగనా మాత్రం ఆ విషయం మీద ఎందుకో సైలెన్స్ పాటించింది. కంగనా అప్పుడప్పుడు తన లో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని అది మీరు మరిచిపోతున్నారు అని చెబుతూ హింట్స్ ఇస్తూ ఉంటుంది.
చీరకట్టులో
అలా ఈ అమ్మడు తాజాగా చీరకట్టులో మెరిసి పోయింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కంగనా రనౌత్ చీరకట్టులో మెరిసిపోతూ వీపందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కేక పెట్టించింది. కంగనాని ఇలా చూసి అందరి మతులు పోతున్నాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
పద్మశ్రీ అందుకుని
ఇక కంగనా రీసెంట్‌గా పద్మశ్రీ అవార్డ్ అందుకుంది. ఇక్కడ కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 'నాపై విమర్శలు గుప్పించే వారందరికీ నేను అందుకున్న అవార్డే సమాధానం చెబుతుంది అని చెబుతూ అదే వారి నోరు మూయిస్తుంది' అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. పద్మశ్రీ అవార్డును అందుకున్న అనంతరం కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే సీత పాత్రను కంగనా రనౌత్ పోషస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'తలైవి'కి సైతం ఆయనే కథను అందించడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇక 'సీత' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











