Mahesh Babu కు అండగా కంగన రనౌత్.. బాలీవుడ్ వివాదంపై స్పందించిన క్వీన్

బాలీవుడ్ ఎంట్రీపై సూపర్ స్టార్ మహేష్ బాబు వివరణ ఇస్తూ.. హిందీ సినీ పరిశ్రమ తనను భరించలేదని చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో వివాదం కావడం తెలిసిందే. ఇటీవల జరిగిన మేజర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాల్లోనే నటించడానికి ఇష్టపడుతాను. ఆ సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమాలతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా బలం తెలుగు సినిమాలే అని అన్నారు.

మహేష్ బాబు వ్యాఖ్యలను తప్పుపడుతూ బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే మహేష్ బాబు వ్యాఖ్యలను సమర్ధిస్తూ బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ అండగా నిలిచారు. కంగన నటించిన ధాకడ్ సినిమా రెండో ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. బాలీవుడ్ నన్ను భరించలేదన్న వ్యాఖ్యల్లో తప్పేమీ కనిపించడం లేదు అని అన్నారు. చాలా మంది దర్శక, నిర్మాతలు ఆయనను సంప్రదించారు. భారీగా ఆఫర్లు ఇచ్చారు. ఇప్పుడు దేశ పరిశ్రమలో టాలీవుడ్ నంబర్ వన్. వాస్తవానికి ఆయనను భరించే శక్తి బాలీవుడ్‌కు లేదు అని కంగన రనౌత్ అన్నారు.

 Kangana Ranaut supports Mahesh Babu over Bollywood entry contraversy

మహేష్ బాబు వ్యాఖ్యలను వివాదాస్పాదం చేయడాన్ని తప్పు పడుతూ.. చిన్న చిన్న విషయాలను రాద్దాంతం చేయకూడదు. వాటిని వివాదంగా మలచడం తప్పు అని అన్నారు. మహేష్ బాబు తన అభిప్రాయలను చెప్పుకొనే హక్కు ఆయనకు ఉంది. ఆయన చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పు అనిపించలేదు. టాలీవుడ్‌లో తన స్థాయిని బట్టి మాట్లాడాడు. గత పదేళ్లలో తెలుగు సినిమా ఎంతో సాధించింది. వారి నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ పరిశ్రమ కూడా అదే బాటలో నడుస్తున్నది అని కంగన రనౌత్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X