దివ్య భారతికి జరిగిన అన్యాయమే సుశాంత్‌‌కు.. బాలీవుడ్ మాఫియాకు వణుకు.. కంగన కామెంట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ స్వాగతించారు. బాలీవుడ్‌లో జరుగుతున్న మాఫియా కార్యకలాపాలకు అంతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ తాజా పరిణామంపై ఆమె మాట్లాడుతూ..

Recommended Video

#CBIForSSR : Kangana Ranaut, Sonu Sood రియాక్షన్ , న్యాయం జరగాలని డిమాండ్ | Onrindia Telugu
 బాలీవుడ్‌లో అనుమానాస్పద మరణాలు

బాలీవుడ్‌లో అనుమానాస్పద మరణాలు

బాలీవుడ్‌లో గతంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే ఆ విషయంలో వచ్చిన ఆరోపణల్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఎంతో మందికి హిందీ చిత్ర పరిశ్రమలో అన్యాయం జరిగింది అని కంగన రనౌత్ పేర్కొన్నారు.

పర్వీన్ బాబీ నుంచి దిశ సలియాన్ వరకు

పర్వీన్ బాబీ నుంచి దిశ సలియాన్ వరకు

బాలీవుడ్‌లో పర్వీన్ బాబీ, దివ్య భారతీ, జియా ఖాన్, శ్రీదేవి, దిశ సలియాన్ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ మరణాల వెనుక వాస్తవాలు వెలుగులోకి రాలేదు. అలాంటి పరిస్థితులే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో కనిపించింది. వారి మరణాల మాదిరిగా సుశాంత్ మరణం వెనుక కుట్రల బయటకు రాకుండా ఉంటే అన్యాయం జరిగినట్టేనని భావించా అని కంగన రనౌత్ తెలిపారు.

 దివ్యభారతికి జరిగిన అన్యాయమే

దివ్యభారతికి జరిగిన అన్యాయమే

దివ్య భారతీ మరణం వెనుక ఎన్నో అనుమానాలు సందేహాలు కలిగాయి. వాటిని ఎవరూ ప్రశ్నించకపోవడం వల చాలా అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జరగవద్దనే కారణంతో అందర్నీ నిలదీసి ప్రశ్నించాను. చివరకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి అని కంగన అభిప్రాయపడ్డారు.

 బాలీవుడ్ మాఫియా వెన్నులో వణుకు

బాలీవుడ్ మాఫియా వెన్నులో వణుకు

ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేశారు. మా చేతిలో ప్రభుత్వాలు ఉన్నాయని విర్రవీగే వారికి ఈ పరిణామం ఓ హెచ్చరిక. సుశాంత్ మరణం కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజాశక్తి ఏంటో తెలిసి వచ్చింది. బాలీవుడ్ మాఫియా వెన్నులో వణుకు పుట్టింది అని కంగన రనౌత్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X