తలైవినా? సత్యభామనా? కంగనా లుక్‌పై దారుణంగా ట్రోలింగ్.. జయలలితకు కూడా కోపం వస్తుందేమో అంటూ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా రూపొందుతోన్న మూవీ తలైవి. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత చరిత్ర ఆధారంగా అనేక చిత్రాలు తెరకెక్కుతున్నప్పటికీ కంగనౌ లీడ్ రోల్‌లో చేస్తోన్న తలైవి కాస్త ముందంజలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

సినీ స్టార్ టు పొలిటికల్ స్టార్..
జయలలిత సినీ రంగంలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. నాటి కాలంలో టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఎంజీర్ లాంటి వారితో జత కట్టి అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా విడుదల చేసిన తలైవి ఫస్ట్ గ్లింప్స్‌లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. సినీ రంగంలో తన స్టార్‌డమ్‌ను తెలియజేసేట్టుగా మొదలైన ఈ వీడియో రాజకీయ వేదికపై తలైవిగా ఎదిగిన తీరును ఆవిష్కరించేట్లుగా ఈ చిత్రం ఉండబోతోందని హింట్ ఇచ్చారు మేకర్స్.

రెచ్చిపోతోన్న ట్రోలర్స్..
యంగ్ జయలలితగా కంగనా సెట్ అయినా.. రాజకీయాల్లోకి వచ్చి అమ్మగా కీర్తించే స్థాయికి ఎదిగిన జయలలిత పాత్రకు ఏమాత్రం సూట్ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మొహానికి, జయలలిత మొహానికి ఏ సంబంధం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఆ మూవీ బడ్జెట్ అంతా ప్రోస్థటిక్ మేకప్‌కే ఖర్చు అయి ఉంటుందని ట్రోలర్స్ కౌంటర్లు వేస్తున్నారు.
నాటి కమల్ హాసన్ లుక్‌తో పోలిక..
కమల్ హాసన్ లేడీ గెటప్ వేసిన భామనే సత్యభామనే చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో కమల్ లుక్‌తో కంగనా తలైవి లుక్‌ను పోలుస్తున్నారు. ఆమె కంటె కమల్ లుక్ బాగుందనే కామెంట్లు పెడుతున్నారు. పిల్లలు చూసే చోటా భీమ్ అనే కార్టూన్ కార్యక్రమంలోని క్యారెక్టర్‌లా కంగనా ఫస్ట్ లుక్ ఉందని అంటున్నారు.
Recommended Video

జయలలితకు కూడా కోపం వస్తుంది..
ఈ టీజర్, ఫస్ట్ లుక్‌ను చూస్తే జయలలితకు కూడా కోపం వస్తుందని, ఆమె జయలలితలా లేదని కనీసం కంగనా అని కూడా గుర్తు పట్టలేకపోతున్నానని, ఆలు గడ్డకు కోపం వస్తే ఉండే మొహంలా ఉందని ఇలా పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తలైవి ఫస్ట్ లుక్‌పైనే ఇంతగా ట్రోల్స్ నడుస్తూ ఉంటే.. సినిమా విడుదలయ్యాక ఇంకే రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











