తలైవిగా అదరగొట్టిన కంగనా.. స్టిల్స్ వైరల్
తమిళ నాడులో సినిమాలు, రాజకీయాలు ఎంతగా పెన వేసుకుని ఉన్నాయో అందరికీ తెలిసిందే. సినీ తారలే అక్కడి రాజకీయాలను శాసించారు. మొన్నటి వరక జయలలిత, కరుణా నిధి శకం నడించింది. ఇద్దరి మరణంతో రాష్ట్రంలో రాజకీయాల్లోపెను మార్పులు సంభవించాయి. అయితే జయలలిత మరణం చుట్టూ మాత్రం ఏదో మిస్టరీ దాగి ఉందని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అప్పట్లో ఎక్కడ చూసి జయలలిత టాపిక్ నడిచేది.
అయితే కొందరు మాత్రం జయలలిత జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే రమ్యకృష్ణతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించేశారు. నిత్యా మీనన్ కూడా జయలలిత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయలలితా నటిస్తోంది. ఇప్పటికే తలైవి లుక్‌లో కంగనా అందరికీ దర్శనమిచ్చింది. అయితే మొదట తలైవిగా కంగనా లుక్‌పై నెగెటివ్ టాక్ వచ్చింది.

కానీ తాజాగా జయలలిత వర్దంతి సందర్భంగా రిలీజ్ చేసిన కొన్ని స్టిల్స్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో కంగనా రనౌత్.. అచ్చం జయలలితగా కనిపిస్తోంది. ఆ నడక, గాంభీర్యం అన్నీ కూడా జయలలితను పోలినట్టే ఉన్నాయి. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











