ఎవడి అయ్యకైనా దమ్ముంటే ఆపండి.. ముంబై నీ జాగీరా? టైమ్, ప్లేస్ అంటూ కంగన సవాల్
శివసేన నేత సంజయ్ రౌత్‌కు బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్‌కు మధ్య మాటల యుద్ధం ముదిరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మీడియా, సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తున్నారు. తాజాగా మరోసారి సంజయ్ రౌత్‌పై కంగన విరుచుకుపడ్డారు. తనను ఆపే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. తాజాగా సంజయ్ రౌత్‌ను సవాల్ చేస్తూ కంగన చేసిన ట్వీట్ వివాదంతోపాటు వైరల్ అవుతున్నది. ఈ వివాదంలోకి వెళితే..

ముంబై కమిషనర్‌పై కంగన ఫైర్
సుశాంత్ మరణం కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లను ముంబై కమిషనర్ ట్విట్టర్ అకౌంట్ లైక్ చేయడంతో కంగన భగ్గుమన్నది. నన్ను బెదిరిస్తూ చేస్తున్న ట్వీట్లను ముంబై కమిషనర్ ఎలా లైక్ చేస్తాడు. ఇలా చేస్తే ముంబైలో నా భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కంగన రనౌత్ ట్వీట్ చేశారు.

ముంబై పోలీసులపై ఆగ్రహం
ఈ క్రమంలో ముంబై పోలీసులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కంగన రనౌత్ ఇటీవల ట్వీట్ చేసింది. నాకు ముంబై పోలీసులు కల్పించే భద్రతపై నాకు నమ్మకం లేదు. వీలైతే హిమాచల్ ప్రదేశ్ సర్కారు లేదా కేంద్ర ప్రభుత్వం కల్పించే భద్రతను స్వీకరిస్తాను అంటూ కంగన పేర్కొన్నారు. అయితే ముంబై పోలీసుల తీరును తప్పు పట్టడంపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు.

కంగనకు సంజయ్ రౌత్ వార్నింగ్
ముంబై పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ముంబైలో ఉంటూ.. ఇక్కడి చిత్రపరిశ్రమలో పనిచేస్తూ వారిపై ఎలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారు? నీవు ముంబైలో ఎలా అడుగుపెడుతావో చూస్తాను? వీలైతే నీవు మనాలీలోనే ఉండు అంటూ బహిరంగ బెదిరింపులకు రౌత్ పాల్పడటంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా?
శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ముంబైలో అడుగుపెట్టవద్దు అంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటంపై ముంబైను చూస్తుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ అనే ఫీలింగ్ కలుగుతున్నది. ముంబై ఎవడి అయ్య జాగీర్ కాదు అంటూ కామెంట్ చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఘాటుగా స్పందించింది.
Recommended Video

ముంబైకి వస్తున్నా.. టైమ్, ప్లేస్ అంటూ
ఇదిలా ఉండగా, తాజాగా సంజయ్ రౌత్‌కు కంగన రనౌత్ పరోక్షంగా సవాల్ విసిరారు. ముంబైలో అడుగుపెట్టవ వద్దంటూ కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో అంటే సెప్టెంబర్ 9వ తేదీన ముంబైకి వస్తున్నాను. నేను ముంబై ఎయిర్‌పోర్టులో ఏ సమయంలో ల్యాండ్ అవుతానో.. సమయం వెల్లడిస్తాను. ఎవరి అయ్యకైనా దమ్ము, ధైర్యం ఉంటే నన్ను ఆపండి అంటూ కంగన ట్విట్టర్‌లో సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications











