బైడెన్ ఓ గజని.. ఏడాది పదవిలో ఉండటం కష్టం.. కమలా హ్యారీస్‌పై కంగన రనౌత్ సెన్సేషనల్ ట్వీట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జయ కేతనం ఎగురవేసిన జో బైడెన్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేరని, ఆ తర్వాత ఉప రాష్ట్రపతి కమలా హారిస్‌దే హవా కొనసాగుతుందని షాకింగ్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. కంగన ఏమని ట్వీట్ చేసిందంటే...

రికార్డు దిశగా కమలా హ్యారీస్
అమెరికాలో అధ్యక్ష అధికార భవనం వైట్ హౌస్‌లో అడుగుపెట్టేందుకు కమల హ్యారిస్ సిద్ధమవుతున్నారు. అమెరికా చరిత్రను తిరగారాసి శ్వేతభవనంలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా రికార్డు క్రియేట్ చేయనున్నారు. తన విజయం లక్షలాది మంది మహిళలకు స్పూర్తిని కలిగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఏడాది కంటే ఎక్కువగా ఉండటం కష్టమే...
ఇలాంటి సమయంలో జో బైడెన్‌పే గజని బైడన్ అంటూ కంగన రనౌత్ కామెంట్ చేశారు. బైడన్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదు. అతడి మెడికల్ డేటా చూస్తూ.. అతడు ఎక్కువగా ఇంజెక్షన్ల, మెడిసిన్‌పైనే ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తున్నది. అతడు అధ్యక్షుడిగా ఏడాది కాలం కంటే ఎక్కువ ఉండటం కష్టమే అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మతిమరుపు వ్యాధితో జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన మద్దతు దారులును ఉద్దేశించి హల్లో మిన్నెసోటా అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అయితే తాను ఫ్లోరిడాలో ఉన్న విషయాన్ని మరిచిపోయారనే విషయం స్పష్టంమైంది. ఈ క్రమంలో ఆయన మెమొరీపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆయన మెమొరీ శక్తిని ఉద్ధేశించి వైద్యులు చేసిన వ్యాఖ్యలు తాజా పరిస్థితికి అద్దం పట్టాయనే వాదన మొదలైంది.

గజనీ మాదిరిగా జో బైడన్ అంటూ కంగన
జో బైడెన్ మెమొరీ పవర్ 15 నిమిషాలకంటే ఎక్కువగా ఉండటం లేదు. ఏదైనా విషయాన్ని ఆయన గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. బాలీవుడ్ చిత్రం గజనిలో అమీర్ ఖాన్ పరిస్థితిలా ఉంది. ఏడాది కంటే ఆయన ఆ పదవిలో కొనసాగడం కష్టం. ఇక వైట్ హౌస్‌లో కమలా హ్యారీస్‌దే పెత్తనం కొనసాగుతుంది అంటూ కంగన జోస్యం చెప్పారు. ఒక మహిళ విజయం సాధిస్తే.. ఎంతో మంది మహిళలకు శక్తి చేకూరుతుంది అంటూ కమలా హ్యారీస్ విజయంపై కంగన ప్రశంసల వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











