For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ రాబందులే సుశాంత్‌ను చంపాయి.. ఆ ముఠాలో కరణ్ జోహర్ సూత్రధారి.. ప్రధానికి కంగన ట్వీట్

  |

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని మాఫియాపై ధ్వజమెత్తుతున్న కంగన రనౌత్ మరోసారి సినీ ప్రముఖులపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో డైరెక్ట్ ఎటాక్ ఇవ్వడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. హిందీ చిత్ర సీమలో ప్రముఖ నటులు, డైరెక్టర్లను లక్ష్యంగా చేసుకొని ట్వీట్లతో హోరెత్తించారు. సంచలనం రేపుతున్న ఆమె వరుస ట్వీట్లు ఏమిటంటే..

  Sushant Singh Rajput : Sushant మృతి కేసులో Karan Johar ప్రధాన సూత్రధారి.. ప్రధానికి కంగన ట్వీట్!
   బాలీవుడ్ మాఫియాలో కీలక సూత్రధారి

  బాలీవుడ్ మాఫియాలో కీలక సూత్రధారి

  బాలీవుడ్ మాఫియాలో కీలక సూత్రధారుడు కరణ్ జోహర్. ప్రధాన మంత్రి గారు ఆయన ఎంతో మంది యువ ప్రతిభావంతుల జీవితాలను నాశనం చేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆయనపై ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవు. ఆయన ఆగడాలను అడ్డుకొనే చర్యలు ఉన్నాయా? ఆయన తన గ్యాంగ్‌తో నాపై దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ కంగన రనౌత్ ట్వీట్ చేశారు.

  సుశాంత్‌ను ఆ రాబందులే చంపాయి

  సుశాంత్‌ను ఆ రాబందులే చంపాయి

  కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్, రాజీవ్ మసంద్ లాంటి మీడియాలోని రాబందులు సుశాంత్‌ సింగ్‌ను చంపాయి. ఓ కుటుంబంలోని ఏకైక కుమారుడు బాలీవుడు కుట్రలకు బలయ్యాడు. ఇలాంటి పనులు చేసిన కరణ్ జోహర్ తమ పిల్లలను ప్రమోట్ చేసుకొనే పనిలో పడ్డాడు. ఇది సిగ్గుచేటు అంటూ కంగన రనౌత్ మరో ట్వీట్‌ చేశారు.

  నన్ను దుర్బాషలాడితే ముంబై సీపీ లైక్‌లు

  నన్ను దుర్బాషలాడితే ముంబై సీపీ లైక్‌లు

  బాలీవుడ్ మాఫియా ఆగడాలను బయటపెడుతున్న తనపై ముంబై పోలీసులు కక్ష పన్నినట్టు వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. నన్ను దుర్బాషలాడుతూ పెట్టిన పోస్టులను ఏకంగా ముంబై కమిషనర్ పరమ్ బీర్ సింగ్ లైకులు కొట్టడం దారుణం. ఇంతకంటే దిగజారుడుతనం ఏదైనా ఉంటుందా అని కంగన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

   ముంబైలో నా భద్రతకు ఎవరు బాధ్యత?

  ముంబైలో నా భద్రతకు ఎవరు బాధ్యత?


  సోషల్ మీడియాలో నాపై దాడులకు పాల్పడుతున్న వారికి ముంబై పోలీసులు మద్దతు పలుకుతూ నన్ను బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో నా వ్యతిరేకులకు సపోర్ట్ చేయడం సరైదేనా? ముంబైలో నా భద్రత ఎంత వరకు సురక్షితం. నా భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు అని కంగన రనౌత్ మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.

  నా వ్యతిరేకులకు మద్దతు తెలిపే దందా

  నా వ్యతిరేకులకు మద్దతు తెలిపే దందా

  అయితే కంగనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లకు పోలీస్ కమిషనర్ లైకులు కొట్టలేదు. ఈ వ్యవహారంపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చేసిన ట్వీట్‌పై కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. నాకు ఇలాంటి అబద్దాలు చెబితే సరే.. ముంబై పోలీస్ కమిషనర్ అకౌంట్‌‌ను ఫాలో అయ్యే వారికి ప్రతి అకౌంట్‌కు నోటిఫికేషన్లు వెళ్లాయి. అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్లు చేసే వారికి అండగా నిలిచే దందాను మీరు ఇంకా కొనసాగిస్తున్నట్టు నాకు అర్ధమవుతుంది అని కంగన ట్వీట్‌లో పేర్కొన్నారు/

   రణ్‌వీర్, రణ్‌బీర్ రక్త నమూనాలతో డ్రగ్స్ పరీక్షలు

  రణ్‌వీర్, రణ్‌బీర్ రక్త నమూనాలతో డ్రగ్స్ పరీక్షలు


  బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ, వికీ కౌశల్ లాంటి వారికి రక్త నమూనాల తీసుకొని డ్రగ్స్ పరీక్షలు జరిపించాలి. వారు కొకైన్ అడిక్ట్స్ అని వస్తున్న రూమర్లకు క్లారిటీ దాంతో దొరుకుతాయి. వారి రక్త నమూనాల్లో స్వచ్ఛత ఉంటే ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడుతుంది అని కంగన రనౌత్ మరో ట్వీట్‌ చేశారు.

  English summary
  Bollywood Actress Kangana Ranaut tweet goes viral over Drug links with Bollywood. Kangana tweeted that, I request Ranveer Singh, Ranbir Kapoor, Ayan Mukerji, Vicky Kaushik to give their blood samples for drug test, there are rumours that they are cocaine addicts, I want them to bust these rumours, these young men can inspire millions if they present clean samples
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X