పులి గాండ్రించినట్లే ఉంది: ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కంగనా న్యూ లుక్
ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవితంగా ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ హిస్టలారికల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా 'మణికర్ణిక' చిత్ర యూనిట్ కంగనాకు సంబంధించిన న్యూ పోస్టర్ విడుదల చేశారు. యుద్ధ రంగంలో శత్రువులను తన ఖడ్గంతో వేటాడుతూ పులిలా గాండ్రిస్తున్న ఉన్న ఈ న్యూ పిక్ 'మణికర్ణిక' సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అక్టోబర్ 2న విడుదల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'మణికర్ణిక' మూవీ చుట్టూ పలు వివాదాలు సైతం ముసురుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు క్రిష్ చేపట్టి షూటింగ్ దాదాపుగా పూర్తయిన తర్వాత తప్పుకున్నారు. సినిమాలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయడానికి ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోవడంతో దర్శకత్వ బాధ్యతలు కంగనా రనౌత్ చేపట్టి సినిమాను పూర్తి చేశారని టాక్. కంగనాతో వివాదం కారణంగా ఈ చిత్రం నుండి సోనూ సూద్ సైతం తప్పుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్లో తెరరెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో 'మణికర్ణిక' ఒకటి. భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకునే వీర వణితల్లో ఒకరైన ఝాన్సీ లక్ష్మిభాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత కమల్ జైన్... జీ స్టూడియోస్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 25, 2019న మూవీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











