twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనా రనౌత్ కట్టుకున్న చీరను చూశారా..? దాని ధర తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు

    |

    కంగనా రనౌత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, తలెత్తిన వివాదాలూ కారణమే. కంగనా ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా వివాదంలో దూరకుండా ఉండదు. అందుకే ఈమె దేశం మొత్తానికి యాక్టర్‌గా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. అందుకే ఆమె ఏం చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. తాజాగా కంగన కట్టుకున్న చీర వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఆ చీర ధరే.

    వాస్తవానికి ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఎప్పుడైనా లగ్జరీ లైఫ్‌నే కోరుకుంటుంటారు. ఖరీదైన కార్లలో తిరగడం.. ఎక్కువ విలువైన దుస్తులు ధరించడం వంటివి చేస్తుంటారు. కానీ, కంగనా మాత్రం వీటన్నింటికీ భిన్నం అనే చెప్పాలి. తాజాగా ఆమె చేనేత చీరను కట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, అసలు ఈ చీర ధర ఎంతో తెలుసా..? కేవలం రూ. 600. చేనేత చీరలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వస్తుంటే అందరూ నోరెళ్లబెట్టి చూసేశారట.

    ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలి వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో 'జైపూర్ వెళ్లేటప్పుడు కంగనా చేనేత చీరను కట్టుకుంది. ఈ చీరను ఆమె కోల్‌కతాలో రూ.600కు కొనుక్కుంది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై బాధపడింది' అని పోస్ట్ చేసింది.

    Kangana Ranaut Wearing A 600-Rupee Saree

    ఇక, తాజాగా కంగనాపై వస్తున్న ప్రశంసలపై ఆమె మరోసారి స్పందించింది. 'కంగనా చేసిన పనిని అభినందిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఫ్యాషన్ అనేది తాత్కాలికమైన అంశం. దాన్ని జాతీయతతో ముడిపెట్టకూడదు. ఇది మేము చేసే ప్రతి పనిలో కనిపిస్తుంది' అని రంగోలి మరో ట్వీట్ చేసింది.

    English summary
    Thank you for appreciating Kangana’s efforts, conscious fashion is the need of the hour, nationalism shouldn’t remain just one fancy topic, it should reflect in every choice that we make.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X