ఆ ‘చెత్త’ నాకు పోటీనా? ఆమెలో గొప్పేముంది.. అలియాభట్‌పై నోరుపారేసుకొన్న కంగన రనౌత్

Recommended Video

Kangana Ranaut Slams Alia Bhatt's Performance In Gully Boy || Filmibeat Telugu

బాలీవుడ్ తారలు అలియాభట్, కంగన రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా వారిద్దరూ ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్నారు. మణికర్ణిక సినిమాతో జోష్ మీద ఉన్న కంగన.. తాజాగా అలియాభట్ నటించిన గల్లీభాయ్ సినిమాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో కంగన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వివరాల్లోకి వెళితే...

మణికర్ణిక మూవీకి గల్లీబాయ్ గట్టిపోటీ

మణికర్ణిక మూవీకి గల్లీబాయ్ గట్టిపోటీ

ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు రకాల అవార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఉత్తమ బాలీవుడ్ చిత్రాల ఎంపిక జరుగుతున్నది. ఈ క్రమంలో మణికర్ణిక సినిమాతో గల్లీభాయ్ పోటీపడుతున్నది. పలు అవార్డుల కార్యక్రమంలో మణికర్ణిక, గల్లీబాయ్ సినిమాలు అవార్డులను గెలుచుకొన్నాయి.

ఉత్తమ నటిగా కంగన రనౌత్

ఉత్తమ నటిగా కంగన రనౌత్

మణికర్ణికలో నటనా ప్రదర్శనతో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకోవడంపై కంగన స్పందించారు. అలియాభట్‌ నుంచి గట్టిపోటీ ఎదురైందా అనే ప్రశ్నకు జవాబిస్తూ... అందులో గొప్ప ఏముంది? గల్లీ బాయ్‌లో సఫీనా పాత్ర అంత గొప్పదా? నాకైతో చాలా ఇబ్బందిగా అనిపించింది అని కంగన రనౌత్ వెల్లడించింది.

అలియాభట్ చాలా రొటీన్‌గా

అలియాభట్ చాలా రొటీన్‌గా

బాలీవుడ్‌లో ఆవేశం ఉన్న యువతి పాత్రలు ఇంతకు చాలా వచ్చాయి. మహిళా చైతన్యంతో కూడిన పాత్రలను ఆదరించారు. కానీ అలియాభట్ పాత్ర చాలా రొటీన్‌గా ఉంది. నాకు అంతగా నచ్చలేదు. అలాంటి పాత్ర నుంచి నాకు గట్టిపోటీ ఎదురువుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలాంటి చెత్త పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆపేయాలి అని కంగన పేర్కొన్నది.

మెంటల్ హై క్యా చిత్రంలో కంగన

మెంటల్ హై క్యా చిత్రంలో కంగన

కంగన రనౌత్ సినిమాల విషయానికి వస్తే, రాజ్ కుమార్ రావుతో కలిసి మెంటల్ హై క్యా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అలాగే అశ్వినీ అయ్యర్ తివారీ రూపొందించే పంగా చిత్రంలో నటిస్తున్నది. ఇటీవల రూపొందించిన మణికర్ణిక అటు ఆర్థికంగాను, ప్రశంసల పరంగాను మంచి క్రేజ్ సంపాదించిపెట్టింది.

RRR మూవీలో అలియాభట్

RRR మూవీలో అలియాభట్

దర్శకుడు రాజమౌళి రూపొందించే RRR చిత్రంలో అవకాశం దక్కించుకొన్న అలియా భట్ ప్రస్తుతం కళంక్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ నటించారు. అలాగే సడక్ 2, తఖ్త్ చిత్రాలను అంగీకరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X