కంగనాను ఆ విషయం తెగ ఇబ్బంది పెడుతుందట.. వైరల్ న్యూస్

బాలీవుడ్ క్వీన్‌గా దూసుకుపోతోంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సినిమాల కంటే బయట జరిగే సంఘటనలతో ఫుల్ ఫేమస్ అవుతూ వచ్చింది. మీటూ ఉద్యమ సమయంలో, మణికర్ణిక విడుదల సమయంలో చేసిన రచ్చతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హల్‌చల్ చేసే కంగనా.. తాజా తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీ అవుతోంది. ఈ సినిమా కోసం కంగనా తెగ కష్టపడుతోందట.

 సోషల్ మీడియాలో రెచ్చిపోయే కంగన, ఆమె సోదరి

సోషల్ మీడియాలో రెచ్చిపోయే కంగన, ఆమె సోదరి

ప్రతీ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లను, వారసత్వం, నెపోటిజంపై కంగనా సోదరి రంగోలి చురకలు అంటిస్తూనే ఉంటుంది. తన చెల్లి కంగనాపై ఎవరైనా మాట తూలితే.. వారిని చీల్చి చెండాడుతుంది. మాటలతో అవతలి వారిని మట్టికరిపిస్తుంటుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చేసే ఈ వ్యాఖ్యల కారణంగా వారిపై కొందరికి నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది.

 మణికర్ణిక విషయంలో ఇద్దరూ ఒక్కటై..

మణికర్ణిక విషయంలో ఇద్దరూ ఒక్కటై..

మణికర్ణిక విషయంలో డైరెక్టర్ క్రిష్‌కు వ్యతిరేకంగా ఇద్దరూ ఒక్కటై దర్శకుడిపై దాడి చేశారు. ఇద్దరు చేసిన చాటింగ్‌లను సోషల్ మీడియాలో పెడుతూ తన సోదరికి మద్దతుగా నిలిచింది. మణికర్ణిక దర్శకుడి విషయంలో కంగనా, క్రిష్ మధ్య వచ్చిన విబేధాలు అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిర్మాతలను తన గుప్పిట్లో పెట్టుకుందని, తనకు నచ్చినట్టే కథను మార్చేసిందని, సోనూసూద్ అందుకే బయటకు వెళ్లాడని అప్పట్లో తెగ హల్‌చల్ చేశాయి.

తాజాగా జడ్జిమెంటల్ హైక్యా..

తాజాగా జడ్జిమెంటల్ హైక్యా..

ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన జడ్జిమెంటల్ హైక్యా.. చిత్రంలోనూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీపై తాప్సీ చేసిన కామెంట్‌పై రంగోలి చెలరేగిపోయింది. తాప్సీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఆ సంఘటన సంచలనంగా మారింది. ఇలా ప్రతీ విషయంలో ఏదో ఒకటి రచ్చ చేస్తూ.. ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు.

Recommended Video

Kangana Asks Ganesha For Blessings ||నేను దేవుడి తో బేరం ఆడతా : కంగనా
ప్రారంభమైన తలైవి.. భాషలో ఇబ్బంది

ప్రారంభమైన తలైవి.. భాషలో ఇబ్బంది

తమిళనాట అమ్మగా ప్రజల గుండెల్లో కొలువైన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాలో అమ్మగా కంగనా నటించబోతోంది. ఈ మూవీ కోసం తమిళం నేర్చుకోవడానికి తెగ ఇబ్బంది పడుతోందని సమాచారం. అయినా సరే డైలాగ్‌లను అర్థం చేసుకుని చెబుతోందని, కష్టమైనా సరే తమిళంలో మాట్లాడుతోందని తెలుస్తోంది. ఈ సినిమా దక్షిణాది అన్ని భాషల్లోనే కాకుండా హిందీలోనూ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X