డ్రామా అంతా చూస్తున్నా.. కంగన, ఊర్మిళ వివాదంపై సన్నిలియోన్ కామెంట్
గత రెండు రోజులుగా మీడియాలో సీనియర్ హీరోయిన్ ఊర్మిళ మతోంద్కర్, కంగన రనౌత్ మధ్య జరుగుతున్న వివాదంలోకి మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌ను లాగడం చర్చనీయాంశమైంది. ఊర్మిళ ఓ పోర్న్‌స్టార్ అంటూ కంగన శివాలెత్తింది. ఈ క్రమంలో చెలరేగిన వివాదంపై కంగన వివరణ ఇస్తూ.. సన్నీలియోన్‌ను కించపరిచే విధంగా కామెంట్ చేయలేదు. పోర్న్‌స్టార్ అయినప్పటికీ సన్నీలియోన్ పరిశ్రమ అక్కున చేర్చుకొన్నది. ఆమెను భారతీయ సినీ పరిశ్రమలోకి స్వాగతించారు అని తన వివరణలో కంగన వెల్లడించింది.
సన్నీ లియోన్ మన రోల్ మోడల్ కాదు. అయినా సన్నీని మన ఇండస్ట్రీ అంగీకరించింది. ఆమెను నటిగా దేశం మొత్తం స్వాగతించింది. పోర్న్‌స్టార్ అని వాడిన పదాన్ని కొందరు ఫెమినిస్టులు తప్పుడు రితీలో ప్రచారం చేస్తున్నారు అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నది.

ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల్లో కంగన, ఊర్మిళ వివాదంలో తనపైరు రావడంపై సన్నిలియోన్ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫోటోతోపాటు కామెంట్‌ను పోస్ట్ చేస్తూ లంచ్ డేట్‌లో వరల్డ్ డ్రామాను అంత గమనిస్తున్నాను అని అన్నారు.
జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో నా జర్ని ప్రత్యేకమైనది. నన్ను పరిశ్రమ అక్కున చేర్చుకోవడం నా అదృష్టం. అందరూ నన్ను వారి మనిషి అని భావించారు కాబట్టే నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. నా అభిమానుల కూడా నాకు అండగా నిలిచారు. వీళ్లందరూ లేకపోతే నేను ఉండేదానిని కాదు అని సన్నీలియోన్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











