పెళ్లికాకుండానే కవల పిల్లలకు తల్లి.. 40 ఏళ్లలో హీరోయిన్ ప్రెగ్నెంట్.. ఎవరామె?
పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది నటి. తాజాగా ఆమె తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గ్గా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె ఫేమస్ నటి కావడం విశేషం. అక్కడి ప్రేక్షకులను వరుస చిత్రాలతో అలరిస్తూ వచ్చింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో పెళ్లి కాకుండానే హీరోయిన్లు డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తుండటం ఆశ్చర్యకరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కన్నడ హీరోయిన్ ఇదే తరహాలో ట్విస్ట్ ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నటి భావన వివరాలు..
ఆమె అసలు పేరు నందిని రమన్న. స్క్రీన్ పేరును భావన రామన్నగా మార్చుకుంది. ఈమె బెంగళూరులో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి భారతనాట్యంలో శిక్షణ పొందింది. బెంగళూరులోనే ఉండటంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఆకర్షితురాలైంది. ప్రస్తుతం ఆమె వయస్సు 40 ఏళ్లకు పైగానే ఉంటుంది. 1996 నుంచి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా తనకు పెళ్లి కాలేదని కన్నడ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చిన నటి..
నటి బావన కన్నడ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ పాత్రల్లోనూ నటించి అలరించింది. అటు హిందీలోనూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరసన నటించి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇక ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లి కాకుండానే తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. ఈ నోట్ కూడా రాసుకొచ్చింది.
కొన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా..
నాకు సపోర్ట్ గా ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు ధన్యవాదాలు. కేవలం తల్లిగానే పిల్లలను పెంచాలని అనుకుంటున్నాను. అందుకు ఐవీఫ్ ద్వారా కవల పిల్లలకు తల్లిగా మారబోతున్నాను. నాకు 20, 30 ఏళ్లలో తల్లి కావాలని, నాకు పిల్లలు కావాలని కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు 40 ఏళ్లలో నాకు పిల్లలను కనాలనిపించింది. కొన్నాళ్లు ప్రయత్నిస్తున్నా. కానీ కొందరు డాకర్లు తిరస్కరించారు. ఎట్టకేలకు ఇప్పుడు కుదిరింది. ఇద్దరు కవలలు నన్ను అమ్మ అని పిలువబోతున్నారు. అని సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.
సినిమాలతోపాటు.. పొలిటికల్ గానూ..
ఇక నటి బావన తొలుత మరిబలె అనే తులు చిత్రంలో నటించింది. ఆ తర్వాత నీ ముడిద మల్లికే అని చిత్రంతో కన్నడ చిత్రం పరిశ్రమలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ చిత్రంతో కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 30 చిత్రాల్లో నటించి మెప్పింది. ఇక రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటోంది. చివరిగా మలయాళ ఫిల్మ్ 'ఒట్టా'తో ప్రేక్షకులను అలరించింది. ఇటు సినిమాలతో పాటు భావన 2012 నుంచి పాలిటిక్స్ లోనూ యాక్టివ్ గా ఉంటోంది. 2013 కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు సపోర్ట్ గా ప్రచారం చేసింది. ఆ తర్వాత 2018లో బీజేపీలో చేరింది.


Click it and Unblock the Notifications











