తెలుగు హీరోలకు షాకిచ్చిన కన్నడ హీరోయిన్..భారీ ఆఫర్లకు ముఖం మీదే నో చెప్పిన బ్యూటీ..!
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో టాలీవుడ్ కు గోల్డెన్ టైం నడుస్తోంది. టాలీవుడ్ లో లక్ కలిసి వస్తే పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ఎంతో టైం పట్టదు. ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీలోని హీరోయిన్లంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కాదనుకుంటారు? కానీ తాజాగా ఓ కన్నడ హీరోయిన్ మాత్రం టాలీవుడ్ కు నో ఛాన్స్ అంటుందట. మరి ఇంతకీ టాలీవుడ్ ను దూరం పెడుతున్న ఆ అమ్మడు ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
కన్నడలో హీరోయిన్లు కాస్త పేరు తెచ్చుకుంటే చాలు టాలీవుడ్ వాళ్ళను రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తుంది. అలనాటి హీరోయిన్ సౌందర్య నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న దాకా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ లో హీరోయిన్లుగా స్థిరపడిపోయారు. అక్కడ సో సో ఇమేజ్ ఉన్న కన్నడ భామలకు ఇక్కడ మాత్రం ఆ రేంజ్ గిరాకీ ఉంటుంది మరి.

ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా సప్తసాగరాలు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రుక్మిణి వసంత్ పై అందరి కన్ను పడింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యింది. కన్నడ మూవీ లవర్స్ కు హాట్ ఫేవరెట్ గా మారిన ఈ కన్నడ బ్యూటీ ని టాలీవుడ్ కు పరిచయం చేయాలని మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారట. ప్రియ పాత్రలో రుక్మిణి యాక్టింగ్ చూసి యూత్ అంతా ఆమె ప్రేమలో పడిపోయారు.

అలా ఆ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రుక్మిణికి ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ దొరికే పరిస్థితి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా రుక్మిణి మాత్రం తెలుగు సినిమాలు చేసే ఆలోచనలో లేదని ప్రచారం జరుగుతుంది. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని సమాచారం.
సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు దక్కుతాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో అయితే కేవలం పాటలు గ్లామర్ కోసమే హీరోయిన్ ను తీసుకుంటారు. అయితే రుక్మిణి మాత్రం ఇలాంటి పాత్రలకు ఆమడ దూరంలో ఉంటుందట. అందుకే టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ తాను పెద్దగా ఆసక్తి చూపించలేదని టాక్.

తన పాత్రపు మంచి స్కోప్ ఉన్న సినిమా అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆలోచిస్తుందట ఈ కన్నడ మామ. నిజానికి సప్త సాగరాలు మూవీ రిలీజ్ అయినప్పుడే టాలీవుడ్ నుంచి ఒకటి రెండు ఆఫర్లు వచ్చిన మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. అలా మొహమాటానికి పోయి ఉన్న క్రేజ్ పోగొట్టుకోకుండా సినిమాల సెలక్షన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. మరి ఈ బ్యూటీ తెలుగు మూవీకి ఎప్పుడు సైన్ చేస్తుందో? ఎలాంటి ప్రాజెక్ట్ తో తెరపైకి వస్తుందో చూడాలి. ఇప్పటికైతే విజయ్ దేవరకొండ, రవితేజ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తుందని రూమర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











