Sankranti 2024 Releases టాలీవుడ్‌లో కన్నడ బ్యూటీల జోరు.. శ్రీలీల, అషికా, శ్రద్దాలో సంక్రాంతి విన్నర్ ఎవరు?
సంక్రాంతి 2024 బరిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రహీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్రేజీగా పోటీపడ్డాయి. అయితే ఈ ఏడాది మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున అక్కినేని లాంటి సీనియర్ హీరోలతోపాటు తేజా సజ్జా అనే కుర్ర హీరో కూడా పోటీకి దిగాడు. అయితే గుంటూరు కారంలో శ్రీలీల, సైంధవ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్, హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ నలుగురిలో ముగ్గురు కన్నడ భామలే కావడం విశేషంగా నిలిచింది. ఈ నలుగురు కన్నడ బ్యూటీల్లో ఎవరికి హిట్ లభించిందంటే?
కన్నడ భామగా శ్రీలీల
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిన కన్నడ భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. గ్లామర్, యాక్టింగ్ పరంగానే కాకుండా డ్యాన్సులు, స్టెప్పులతో అదరగొట్టింది. మహేష్‌తో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసింది. నాది నక్లెస్ గొలుసు, ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి సినిమాల్లోని పాటలపై చేసిన డ్యాన్స్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నా సామిరంగతో చిత్రంతో అషిక రంగనాథ్
ఇక నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్ కూడా కన్నడ భామనే. క్రేజీ బాయ్ అనే సినిమాతో కన్నడ రంగంలో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్‌తో కలిసి అమిగోస్ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి నా సామిరంగ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, గ్లామర్‌కు అభిమానుల ఫిదా అవుతున్నారు.

సైంధవ్ మూవీతో శ్రద్దా శ్రీనాథ్
2024 సంవత్సరంలో సంక్రాంతి బరిలో దూకిన మరో కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్. కోహినూర్ అనే మలయాళ సినిమాతో కెరీర్ ఆరంభించినా.. కన్నడ భాషలో ఆమె నటించిన యూ టర్న్‌తో మంచి హిట్ సొంతం చేసుకొన్నది. తెలుగులో జెర్సీ అనే సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత జోడి, కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రాల్లో నటించింది. తాజాగా వెంకటేష్‌తో కలిసి సైంధవ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.

హనుమాన్‌తో అమృతా అయ్యర్
ఇక హనుమాన్ చిత్రంలో నటించిన అమృతా అయ్యర్ పరభాష నటినే. ఈ తమిళ భామ నటించిన హనుమాన్ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. అమృతతోపాటు శ్రీలీల, అషికా రంగనాథ్, శ్రద్దా శ్రీనాథ్ ముగ్గురు కూడా తమ ఖాతాలో విజయాలను వేసుకొన్నారు. ఈ సారి తెలుగులో కన్నడ భామ హవా భారీగానే కొనసాగింది.
విజయం ఎవరికంటే?
అయితే శ్రీలీల, అషికా రంగనాథ్, శ్రద్దా శ్రీనాథ్ ముగ్గురు సంక్రాంతి బరిలో భారీ హిట్లను సొంతం చేసుకొన్నారు. గుంటూరు కారం 170 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తే.. హనుమాన్ 100 కోట్ల కలెక్షన్ల వైపు పరుగులు పెడుతున్నది. ఇక నా సామిరంగ సినిమా కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. శ్రద్దా బెటర్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











