నాని సినిమాలో కన్నడ హీరోయిన్.. యు టర్న్ భామకు లక్కీ ఛాన్స్!
నేచురల్ స్టార్ నాని ఇటీవల దేవదాస్ చిత్రంతో ఆడియన్స్‌ని పలకరించాడు. కింగ్ నాగార్జున, నాని కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. త్వరలో నాని కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో జెర్సీ చిత్రంలో నాని నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని క్రికెటర్ పాత్రలో నటించబోతున్నాడు.
క్రికెట్ నేపథ్యంలోనే సినిమా మొత్తం ఉంటుంది. దీని కోసం నాని క్రికెట్‌లో ప్రత్యకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ కోసం దర్శకుడు పలువురి పేర్లని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా శ్రద్దా శ్రీనాథ్ పై దృష్టి పెట్టారట. శ్రద్దా శ్రీనాథ్ ఇప్పుడిపుడే కన్నడలో మంచి అవకాశాలని అందుకుంటోంది. కన్నడ సూపర్ హిట్ చిత్రం యూ టర్న్ లో శ్రద్ధ నటించింది. తెలుగులో తొలి సరసన నటించే అవకాశం రావడం అదృష్టమనే చెప్పొచ్చు. శ్రద్దా శ్రీనాథ్ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











