కరీనా కపూర్ గర్బవతి.. రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సైఫ్ దంపతులు

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని సైఫ్ దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే వారికి తైమూర్ ఆలీ ఖాన్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తాము రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వెల్లడిస్తూ..

 కరీనా ప్రెగ్నెన్సీపై రూమర్లు

కరీనా ప్రెగ్నెన్సీపై రూమర్లు

గత కొద్దికాలంగా కరీనా ప్రెగ్నెంట్ అనే రూమర్లు భారీగా మీడియాలో ప్రచారం కాగా స్వయంగా కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చారు. తన గురించి అత్యంత ఆసక్తిని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని కరీనా ఘాటుగా స్పందించారు. ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ.. సైఫ్, తను రెండో బిడ్డ గురించి ప్లాన్ చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

 కరీనా గర్బవతి అని తెలియగానే

కరీనా గర్బవతి అని తెలియగానే

తాజాగా కరీనా గర్భవతి అనే విషయాన్ని వైద్యులు ధృవీకరించగానే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మా కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతున్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం. మాపై ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతీ ఒక్కరికి మా ధన్యవాదాలు అంటూ సైఫ్, కరీనా సంయుక్తంగా ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రముఖులు, సన్నిహితుల విషెస్

ప్రముఖులు, సన్నిహితుల విషెస్

కరీనా కపూర్ రెండోసారి గర్బవతి అనే విషయం అధికారికంగా బయటకు రాగానే బాలీవుడ్ ప్రముఖులు తమ విషెస్‌తో ముంచెత్తారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలంటూ పలువురు సన్నిహితులు జాగ్రత్తలు, సూచనలు చెప్పడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో కరీనా దంపతులుకు భారీగా శుభాకాంక్షలతో కూడిన మెసేజ్‌లు అందుతున్నాయి.

కరీనా కపూర్ పర్సనల్ లైఫ్

కరీనా కపూర్ పర్సనల్ లైఫ్

బాలీవుడ్ చోటా నవాబ్ సైఫ్ ఆలీఖాన్‌తో కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత కరీనా కపూర్, సైఫ్ 2012లో వివాహం చేసుకొన్నారు. 2016 డిసెంబర్ 20 తేదీన వారిద్దరూ తైమూర్ ఆలీ ఖాన్‌కు జన్మనిచ్చారు. తైమూర్ అనే పేరు పెట్టడం అప్పట్లో వివాదాస్పదమైంది. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత కరీనా కపూర్ రెండోసారి గర్బం దాల్చడం గమనార్హం.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
కరీనా కపూర్ కెరీర్ గురించి

కరీనా కపూర్ కెరీర్ గురించి

ప్రస్తుతం అమీర్ ఖాన్ రూపొందిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో కరీనాకపూర్ నటిస్తున్నారు. విదేశాల్లో ఈ షూటింగ్ మొదలుపెట్టారు. లాక్ డౌన్ జాగ్రత్తలు తీసుకొంటూ ఈ షూటింగ్‌ను ముందు తీసుకెళ్లేందుకు అమీర్ ప్రయత్నిస్తున్నారు. ఇక కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ అనే చిత్రంలో కూడా కరీనా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X